Sunday, May 4, 2025
- Advertisement -

జగన్ కు “చిప్పకూడు” అన్నాడు.. ఇప్పుడు ఆయనకే ‘చిప్పకూడు’..!

- Advertisement -

ఎన్టీఆర్ ట్రస్టు భవన్ నుంచి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెగ విమర్శించిన వారిలో ఒకరు రేవంత్ రెడ్డి. ఇప్పుడు కాదు కానీ… రాష్ట్ర విభజన జరగక మునుపు, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి జగన్ పై ఒక రేంజ్ లో విరుచుకుపడే వారు. తెలుగుదేశం నేతలు అంతా జగన్ ను విమర్శించే వాళ్లే కానీ.. రేవంత్ రెడ్డి మాటలు మాత్రం తూటాల్లా ఉండేవి!

 

“జైల్లో జగన్ చిప్పకూడు తింటున్నాడు…” అంటూ అనేక మార్లు విమర్శించాడు రేవంత్ రెడ్డి. జగన్ అవినీతి పరుడు అని.. దొంగ అని.. అందుకే ఆయనకు ఆ గతి పట్టిందని.. వైకాపా ను మూసేసుకోవాల్సిందేనని.. ఆ పార్టీ అధినేత జైల్లో “చిప్పకూడు” తింటున్నాడు కాబట్టి.. ఆ పార్టీ ని మూసేయాలని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించేవాడు. ఒకసారి కాదు.. రెండు సార్లు కాదు.. రేవంత్ రెడ్డి జగన్ విషయంలో పదే పదే “చిప్పకూడు” అనే పదాన్ని వాడేవాడు!

మరి కాల చక్రం తిరుగుతూనే ఉంటుంది కదా.. కొన్ని నిమిషాల ముందే రేవంత్ రెడ్డిని పోలీసులు జైలుకు తరలించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవడం పూర్తి అయ్యాకా రేవంత్ ను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. ఏసీబీ ఆయనపై నమోదు చేసిన కేసు విచారణలో భాగంగా రేవంత్ రెడ్డికి 14 రోజుల రిమాండ్ ను విధించారు. ఈ సమయాన్ని ఆయన జైల్లోనే గడపాల్సి ఉంటుంది. కాబట్టి.. ఆయన కూడా “చిప్పకూడు” తినక తప్పదేమో!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -