- Advertisement -

లోకేష్ రాజీనామా చేయాల్సిందే: రోజా

- Advertisement -

మెగా డీఎస్సీలో భారీ అక్రమాలు జరిగాయని, దీనిపై సమగ్రంగా సీబీఐ విచారణ జరపాలని మాజీ మంత్రి, వైయస్ఆర్సీపీ నేత ఆర్కే రోజా డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం, పుత్తూరు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఆమె ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా నారా లోకేశ్ మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆమె తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

ఈ సందర్భంగా పుత్తూరులో ఏర్పాటు చేసిన నిరసన రాలీ అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద ఆర్కే రోజా మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మొట్టమొదటి ఉద్యోగ నోటిఫికేషన్ ఇదేనని, అయితే ఇందులో జరిగిన అవకతవకలు అందరికీ కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్నాయని ఆరోపించారు. ప్రశ్నాపత్రం తయారు చేసిన నవీన్ అనే వ్యక్తికే ఏకంగా మొదటి ర్యాంక్ రావడం దీనికి నిదర్శనమని, అక్కడే పేపర్ లీకేజ్ ఏ స్థాయిలో జరిగిందో అందరికీ అర్థమైందని విమర్శించారు.

పేపర్ లీకేజ్ జరగలేదంటే.. ఫస్ట్ ర్యాంక్ వచ్చిన నవీన్‌కు ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదని, రెండో ర్యాంక్ వచ్చిన వారి నుంచి ఎందుకు ఎంపిక చేపట్టాల్సి వచ్చిందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని రోజా నిలదీశారు. ఇక స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల కేటాయింపులోనూ పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని మండిపడ్డారు. ఎప్పుడూ లేని విధంగా స్పోర్ట్స్ కోటాలో పరీక్ష నిర్వహించి, ఆ తర్వాత సర్టిఫికెట్లు వెరిఫై చేసి ఉద్యోగాలు ఇవ్వడం ఆనవాయితీ అని.. కానీ, వీరు మాత్రం డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత దొంగ జీవోలను తెరపైకి తెచ్చారని ఆరోపించారు. ప్రభుత్వ పోస్టులను అమ్ముకోవడానికి, ఆ మార్గం ద్వారా ప్రజల సొమ్మును దోచుకోవడానికే ఈ జీవోలను దుర్వినియోగం చేశారని తీవ్ర ఆరోపణలు గుప్పించారు.

ఈ అక్రమాలపై నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేశ్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కేవలం డీఎస్సీ అక్రమాలే కాకుండా, రాష్ట్రంలో గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీ ప్రకారం నిరుద్యోగ భృతిని వెంటనే చెల్లించాలని ఆర్కే రోజా ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -