Friday, May 17, 2024
- Advertisement -

బీకాంలో ఫిజిక్స్‌ ఎమ్మెల్యే పై రోజా కామెంట్స్

- Advertisement -
Roja Comments On MLA Jalil Khan

టీడీపీ ఎమ్మెల్యే జలీల్‌ ఖాన్‌ ఓ ఇంటర్వ్యూలో బీకాంలో ఫిజిక్స్‌ ఉంటుంది.. ఫిజిక్స్‌ నేను చదివాను అంటూ చెప్పి తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా బాగా ఫేమస్‌ అయ్యారు. అయితే కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా జలీల్‌ ఖాన్‌ ఫిజిక్స్‌ జోకులు భారీగా పేళుతున్నాయి. ఈ క్రమంలో జలీల్‌ ఖాన్‌తో డైరెక్ట్‌గా కూడా కొందరు ఫిజిక్స్‌ అంటూ జోక్‌ చేస్తున్నారు.

తాజాగా ఏపీ అసంబ్లీ సమావేశాలు అయ్యాయి. ఈ సమావేశాల్లో హాజరు అయిన జలీల్‌ ఖాన్‌ను కొందరు అపహాస్యం చేశారు. వైకాపా నుంచి టీడీపీకి వెళ్లిన ఆయనకు.. వైకాపాలో మంచి సన్నిహితులు ఉన్నారు. ఆ కారణంగా వైకాపా లాబీలోకి జలీల్‌ ఖాన్‌ వెళ్లాడు.

ఆ టైంలో వైకాపా ఎమ్మెల్యేలు జలీల్‌ ఖాన్‌తో మాట్లాడుతూ అన్నా ఫిజిక్స్‌ ఎలా ఉందే, బాగా చదువుతున్నావా అంటూ నవ్వుకున్నారట. అదే టైంలో ఎమ్మెల్యే రోజా వచ్చి ‘హాయ్‌ ఫిజిక్స్‌’ ఎలా ఉన్నావ్‌ అన్నదట. దాంతో పాటు.. మేము ఎన్నిసార్లు అరెస్ట్‌ అయినా, ఎన్ని ఉద్యమాలు చేసినా కూడా రాని గుర్తింపు నీకు చిన్న ఇంటర్వ్యూతో వచ్చింది కదా అంటూ రోజా అన్నదంట. దాంతో అక్కడ ఉన్నావరంతా ఒక్కసారిగా ఘొల్లున నవ్వారట. ఆ టైంలో అందరితో నేను అంటే ఎలా, నేను ప్రత్యేకం అందుకే తాను అంతగా గుర్తింపు తెచ్చుకున్నాను అంటూ జలీల్‌ ఖాన్‌ వైకాపా ఎమ్మెల్యే జోకులకు కౌంటర్‌ వేశాడు. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -