Thursday, May 9, 2024
- Advertisement -

రోడ్డు మీద పరిగెత్తించి నరికి నరికి చంపారు

- Advertisement -

అతనొక రౌడీ షీటర్ అర్ధరాత్రి రెండు తరవాత నిద్ర పట్టకపోతే సెంటర్ లోని బడ్డీ కి వచ్చి సిగిరెట్ తాగడం బాగా అలవాటు, అదే అలవాటు తో నిన్న రాత్రి సిగిరెట్ బడ్డీ దగ్గరకి వచ్చి పొగ వెలిగించి దమ్ములాగాడు. సాధారణంగా చుట్టూ ఎప్పుడూ తన మందీ మార్బలం తో ఉండే ఆ వ్యక్తి అర్ధరాత్రి కావడం తో ఒంటరిగా బయటకి వచ్చాడు. ఆ సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు సినిమా ఫక్కీ లో అతని మీద దాడి చేసారు. 

వారి దాడిలో తీవ్ర గాయాలు అయినా కూడా వైజాగ్ రోడ్ల మీద పరిగెడుతూ తన ప్రాణం కాపాడుకోవడం కోసం చాలా ప్రయత్నం చేసాడు అతను. వారు సుమోల్లో,బైక్ ల మీదా రావడం తో అది సాధ్యపడలేదు.

రౌడీ షీటర్ పట్నాల సంతోష్ కుమార్ గా పోలీసులు చెబుతున్న ఇతను లోకల్ గా పెద్ద గూండా, ఎప్పుడో 10 సంవత్సరాల కృతమే అతనిమీద రౌడీ షీట్ ఉండగా ఎవరో ప్రత్యర్ధులు కావాలనే అతని మీద పూర్వ దాడులు మీద రివెంజ్ కోసం ఇలా దాడి చేసారు అని పోలీసులు అనుమానిస్తున్నారు.

సినీ ఫక్కీ లో రోడ్ల మీద అతను పారిపోతుంటే మూకుమ్మడిగా దాడి చేసి నరికి వెళ్ళిపోయారు దుండగులు ఇంత జరుగుతున్నా పోలీసులు రెస్పాండ్ అవ్వకపోవడం క్యూస్షన్ మార్క్ గా మిగిలింది. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -