తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉంది. తమిళనాడు ప్రభుత్వం మాత్రం జయ ఆరోగ్య పై సమాచారాన్ని బయటకు పొక్కనీయడం లేదు.చివరకి ప్రతిపక్ష నేత కరుణానిధి కూడా జయ ఆరోగ్యం విషయం బయట పెట్టాలని డిమాండ్ చేయడం రకరకాల ఉహాగానాలకు తావిస్తోంది.
10 రోజుల క్రితం జయలలిత అనారోగ్యంతో చెన్నై అపోలో ఆసుపత్రి లో చేరారు.అప్పటి నుంచి అనేక పుకార్లు వినిపిస్తున్నాయి. ఆమె మెరుగైన వైద్యం కోసం సింగపూర్ కు తరలించనున్నారని కొన్ని రోజుల క్రితం వినిపించిన వార్త.ఆ తరువాత ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని త్వరలో డిశ్చార్జ్ చేస్తారని వార్తలు వినిపించారు.. అయితే తాజాగా చెన్నై లోని అపోలో ఆసుపత్రి ఆవరణం లో భారీగా పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారని వార్తలు రావడం తో జయ అభిమానుల్లో ఆందోళన మొదలైంది.
కాగా ఓ ప్రాన్స్ మహిళ జయలలిత ఆరోగ్యం ఆందోళన కరంగా ఉందంటూ పేస్ బుక్ లో కామెంట్ పోస్ట్ చేసింది. దీనితో అన్న డీఎంకే ఐటి కార్య దర్శి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆమహిళను పోలీస్ లు అరెస్ట్ చేశారు. ఏదిఏమైనా తమిళనాడు ప్రభుత్వం జయ ఆరోగ్యం గురించిన నిజాలు వెల్లడించడం లేదనేది మాత్రం వాస్తవం.