మనుషులు మందేస్తే నానా హంగామా చేయడం కామన్ దాన్ని ఎవరూ పట్టించుకోరు. కాని జంతువులు పుల్‌గా మందేశాయంటే వాటి రచ్చను తట్టుకోవడం ఎవరి వల్లకాదు. జంతువులేంటి మందేయడమేంటనుకుంటన్నారా…? మీరు వింటున్నది నిజమే. మదపటేనుగులు ముందుగానే నానా హంగామా చేస్తాయి…అదే ఏనుగులు పుల్‌గా మందేశాయంటే వాటిని అదుపు చేయడం సాధ్యం కాదు.
ఇదంతా ఎందుకనుకుంటున్నారా…! కేరళలో మదపటేనుగుల మంద పుల్‌గా మందేసి అయ్యప్ప భక్తులకు ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. రోడ్డుకు అడ్డంగా నిలబడి రచ్చ చేస్తున్నాయి. ఆ గజరాజుల్ని కంట్రోల్ చేయలేక అటవీశాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
ఆగష్టులో వర్షాలు, వరదలు కేరళను ముంచెత్తాయి. పంబ నది కూడా పొంగిపొర్లడంతో.. ఆ వరద దెబ్బకు ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు గోదాంలో ఉన్న చెరుకు మొత్తం కుళ్లిపోయిందట. ఈ చెత్తా, చెదారం మొత్తం కలిసి సారా తయారీకి ఉపయోగించే మొలాసిస్‌లా తయారయ్యిందట. ఆలయ సిబ్బంది ఆ ద్రావకాన్ని తెచ్చి.. పక్కనే ఉన్న ఓ గోతిలో పడేశారు.
ఆలయ సిబ్బంది గోతిలో ఆ ద్రవాన్ని పోసి.. పైన మట్టి కప్పడం మర్చిపోయారు. దీంతో ఆ వాసనను పసిగట్టిన గజరాజులు.. రాత్రిపూట వచ్చి ఆ ఊటను పుల్‌గా తాగుతున్నాయి. తాగిన తర్వాత అడవిలో నానా హంగామా చేస్తూ.. పెద్ద, పెద్దగా అరుస్తూ రోడ్డుపైకి పరుగులు తీస్తున్నాయి.
మెల్లగా అవి తాగుడుకు అలవాటు పడుతున్నట్టు కనిపిస్తున్నది. దీనివల్ల ఏం ఉపద్రవం వచ్చిపడుతుందోనని అటవీ అధికారులు దడుసుకుంటున్నారు. సారాను పోలిన ఆ ద్రవం తాగడం వల్ల ఏనుగులకు కిక్కు వస్తోంది. బేస్ క్యాంపువైపు వచ్చే ఏనుగులు మామూలు అదిలింపులకు బెదరడం లేదని, పక్కకు తొలగకుండా మొండికేస్తున్నాయని ఓ అటవీ అధికారి చెప్పారు.