దక్షిణాదిపై ఆప్ కన్ను

- Advertisement -

పంజాబ్ లో విజయకేతనం ఎగరేసి మంచి జోరు మీద ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ మరింత దూకుడు పెంచింది. ఢిల్లీతో పాటు పంజాబ్ లోనూ ఆప్ ప్రభుత్వం ఏర్పడింది. ఇదే ఊపు మీద మరకొన్ని రాష్ట్రాల్లోనూ పార్టీని పటిష్టం చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ గట్టి పట్టుదలతో ఉన్నారు. ఇప్పటివరకు ఉత్తరాది రాష్ట్రాలకే పరిమితమైన ఆప చూపు ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలపై పడింది.

ఇందులో భాగంగా కేరళలోని ట్వంటీ20 పార్టీతో ఆమ్ ఆద్మీ పార్టీ పొత్తు పెట్టుకుంది. స్వయంగా కొచ్చి వచ్చిన కేజ్రీవాల్ ట్వంటీ20తో కలిసి పీపుల్స్ వెల్ఫేర్ అలయన్స్ ను ప్రకటించారు. ఇప్పటివరకు ఎల్డీఎఫ్‌, యూడిఎఫ్‌, ఎన్డీయే కూటములు ఉన్నాయనీ..నాలుగో ఫ్రంట్ గా తాము వచ్చామన్నారు కేజ్రీవాల్.

- Advertisement -

రాజకీయాలు, అల్లర్లు కావాలంటే ఇతర కూటముల వైపు వెళ్లొచ్చనీ.. అభివృద్ధి, పాఠశాలలు, ఆసుపత్రులు కావాలంటే తమ వద్దకు రావాలన్నారు.

ప్రజల్లో వెళ్లేందుకు సిద్ధమవుతున్న కాంగ్రెస్

అమిత్ షా కాదు అబద్ధాల బాద్ షా

ఏపీ మంత్రిపై అయ్యన్నపాత్రుడు సంచలన ఆరోపణలు

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -