రేప్ ఆరోపణలతో యువ దర్శకుడు అరెస్టు

రేప్ ఆరోపణలతో ఓ యువదర్శకుడు అరెస్టు అయ్యారు. మలయాళ సినీ ఇండస్ట్రీలో చోటుచేసుకున్న ఈ పరిణామం అక్కడ పెను దుమారం రేపుతోంది. తనపై అత్యాచారం చేశాడంటూ ఓ యువతి ఫిర్యాదు చేయడంతో మలివుడ్ దర్శకుడు లిజు కృష్ణను పోలీసులు అరెస్టు చేశారు. నివిన్ పాలీ హీరోగా తెరకెక్కుతున్న ‘పడవెట్టు’ అనే సినిమాకు లిజు కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు.

డైరెక్టర్‌గా ఇదే అతడికి తొలి చిత్రం. అయితే లిజు కృష్ణకు వ్యతిరేకంగా చిత్ర బృందానికి చెందిన ఓ యువతి కక్కనాడ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు మార్చి6న ఆయన్ను తమ కస్టడీలోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కన్నూర్‌లో జరుగుతోంది. పోలీసులు డైరెక్టర్‌ను అరెస్టు చేయడంతో చిత్రీకరణను వాయిదా వేశారు.

మంజు వారియర్, అదితి బాలన్, నివిన్ పౌలీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని నటుడు సన్నీ వేన్ నిర్మిస్తున్నాడు. పెదవెట్టు సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు లిజు కృష్ణ. ఇంతకుముందు సన్నీ వేన్, లిజు కలిసి మూమెంట్ జస్ట్ బిఫోర్ డెత్ అనే నాటకానికి పనిచేశారు. ఆ నాటకానికి సన్నీ దర్శకత్వం వహించగా.. లిజు నిర్మించారు. పెదవెట్టు చిత్రం పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతోంది.

నటి సంజనకు అశ్లీల సందేశాలు.. పోలీసుల విచారణలో ఏం తేలిందంటే..?

కాబోయే పీఎం చెబుతున్నారు వినండి… పవన్‌పై రామ్‌గోపాల్‌ వర్మ ట్వీట్

బాలీవుడ్ బ్యూటీతో లవ్‌లో సందీప్ కిషన్.. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారా ?

Related Articles

Most Populer

Recent Posts