వింగ్ కమాండ్ అభినందన్.. సెకండ్ జనరేషన్ మిగ్ 21 పైలట్. సరిహద్దు దాటి భారత భూభాగంలోకి వచ్చిన పాకిస్తాన్ ఫోర్త్ జనరేషన్ ఎఫ్-16 ఫైటర్ జెట్ విమానాన్ని పారిపోయేలా చేశాడు.. అంతేకాదు దానిని కూల్చేశాడు. కానీ దురదృష్టవశాత్తు సాంకేతిక సమస్యలతో జెట్ కుప్పకూలిపోవడంతో శతృ దేశ సైనికులకు చిక్కాడు.
అతడిని విపరీతంగా హింసించారు.. ఆ వీడియోలను షేర్ చేసుకొని ఆనందించారు.. కానీ అతనిలో ఇసుమంతైన భయం కానీ.. బెరుకు కానీ కనిపించలేదు.. వారి దెబ్బలు అతడి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతియలేకపోయాయి. అతడి నుంచి రహస్యాలను రాబట్టలేకపోయాయి. అతడి హోదా.. ర్యాంక్‌ను తప్ప ఇంకేం చెప్పించలేకపోయారు. నీవు ఏ ప్లేన్ నడిపావు అన్న ప్రశ్నకు సమాధానం చెప్పడానికి సున్నితంగా తిరస్కరించాడు.. నేను చెప్పకూడదని నిర్మోహమాటంగా చెప్పేశాడు. ఆ మాటలోనే తెలుస్తోంది.. మీరేం చేసినా నా వద్ద నుంచి సమాధానాలు రాబట్టలేరన్న విశ్వాసం.
ఇప్పుడు పాకిస్థాన్ చెరలో బందీగా ఉన్న భారత వాయసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌ను క్షేమంగా విడిపించేందుకు భారత్ తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. అభినందన్‌కు ఎటువంటి హాని తలపెట్టకుండా క్షేమంగా విడిచిపెట్టాలని కోరుతూ పాకిస్థాన్‌లోని భారత్ హైకమిషన్.. పాక్ విదేశీ వ్యవహారాల శాఖను కోరింది. న్యూఢిల్లీలోని పాక్ తాత్కాలిక హై కమిషనర్‌కు నిన్ననే ఈ విషయాన్నిస్పష్టంచేసిన భారత్ తాజాగా, పాక్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లింది. అభినందన్ క్షేమంగా తిరిగి రావాలని దేశం మొత్తం కోరుకుంటుంది.. ఎదురు చూస్తోంది.