Wednesday, May 15, 2024
- Advertisement -

సానియా మీర్జా- క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌ దంపతులకు త‌ల్లిదండ్రులుగా ప్ర‌మోషన్…

- Advertisement -

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా హైదరాబాద్‌లో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో సానియా, షోయబ్‌ మాలిక్‌ దంపతులకు తల్లిదండ్రులుగా ప్రమోషన్‌ వచ్చేసంది. ఈ సందర్భంగా ఆమె భర్త షోయబ్‌ మాలిక్‌ ఆనందాన్ని వ్యక్తపరుస్తూ.. ‘ఈ శుభవార్తను మీతో పంచుకోవడం ఎంతో ఉద్వేగభరితంగా ఉంది. మగబిడ్డ.. నా శ్రీమతి ఎప్పటిలాగానే చాలా స్ట్రాంగ్‌గా ఉంది. మీ ప్రేమాభిమానాలు, ఆశీర్వాదాలకు కృతఙ్ఞతలు’ అంటూ ట్వీట్‌ చేశాడు.

దీంతో సోషల్‌ మీడియాలో సానియా దంపతులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ‘ ఈ క్షణం ఎంతో ఉద్వేగభరితంగా ఉంది. ఇరుదేశాలకు అభినందనలు’ అంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బాలీవుడ్ బాలీవుడ్‌ కొరియోగ్రాఫర్‌, సానియా బెస్ట్‌ఫ్రెండ్‌ ఫరాఖాన్‌ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -