Sunday, May 26, 2024
- Advertisement -

నిందుతుడు శ్రీనివాస్‌నుంచి కేకేకు పోన్ కాల్స్‌..ఎవ‌రా కేకే..?

- Advertisement -

వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌పై దాడి కేసు విచారణను సిట్ వేగవంతం చేసింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగానే ఏపీలోని పలు ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాలకు కూడ సిట్ బృందం వెళ్లి విచారణ నిర్వహిస్తోంది. విచార‌ణ‌లో తాజాగా మ‌రో కీల‌క విష‌యం బ‌య‌ట‌ప‌డింది. దీంతో కేసు విచార‌ణ అస‌క్తిక‌ర మ‌లుపు తిరిగింది.

రోజుల పాటు నిందితుడు శ్రీనివాసరావును విచారించి, కీలక సమాచారాన్ని రాబట్టడంలో విఫలమైన సిట్ అధికారులు, నేడు మాత్రం కేసును మలుపు తిప్పే ఆధారాన్ని సంపాదించినట్టు తెలుస్తోంది. శ్రీనివాస్ బ్యాంకు లావాదేవీలు, కాల్ డేటాను పరిశీలించిన పోలీసులు, తమకు వచ్చిన ఓ అనుమానాన్ని తీర్చుకునేందుకు లోతైన ప్రశ్నలు సంధించి ఈ విషయాన్ని రాబట్టినట్టు సమాచారం.

విశాఖ వైసీపీ కార్యాలయంలో ఆఫీస్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న కేకేతో పలుమార్లు శ్రీనివాసరావు మాట్లాడినట్టుగా సిట్ అధికారులు గుర్తించారు.విశాఖ వైసీపీ కార్యాలయంలో ఆఫీస్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న కేకేతో శ్రీనివాసరావు ఎందుకు పలుమార్లు పోన్లో సంభాషించాల్సి వచ్చిందనే విషయమైసిట్ అధికారులు ఆరా తీస్తున్నారు.

గడచిన 9 నెలల వ్యవధిలో శ్రీనివాస్ ఫోన్ నుంచి 10 వేల కాల్స్ వెళ్లాయన్న సంగతి తెలిసిందే. ఇందులో సుమారు 500 కాల్స్ కు పైగా వైఎస్ఆర్ సీపీ ఆఫీస్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న కేకే అనే వ్యక్తికి చేసినట్టు తేలింది. గుంటూరులో ఉన్న కేకేను ప్రశ్నించేందుకు విశాఖ నుంచి ప్రత్యేక బృందం వచ్చింది.

ఈ కేకే అనే వ్యక్తి ఎవరన్నదీ ఇంకా బయటకు రానప్పటికీ, అతను వైసీపీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నాడని తెలుస్తోంది. ఇతనికి, శ్రీనివాసరావుకు మధ్య ఉన్న సంబంధం ఏంటన్న కోణంలో విచారణ సాగుతోంది. దీనిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారికంగా స్పందించాల్సివుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -