Saturday, May 18, 2024
- Advertisement -

విముక్తి లేదు.. సల్మాన్ జైలుకెళ్లక తప్పదా..?!

- Advertisement -

హిట్ అండ్ రన్ కేసులో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కు దాదాపుగా విముక్తి లభించినట్టే. కింది కోర్టులో విధించబడ్డ శిక్షను పై కోర్టు సస్పెన్షన్ లో ఉంచి.. సల్మాన్ కు బెయిల్ ను ఇవ్వడం ద్వారా కోర్టు ఆయనకు ఊరటను ఇచ్చింది.

మరి ఈ ఉత్సాహంలో ఈ హీరో సినిమా షూటింగుల్లో పాల్గొంటున్నాడు. అయితే ఇంతటితో సల్మాన్ కు విముక్తి లభించినట్టుగా మాత్రం కనిపించడం లేదు.
ఇప్పుడు సల్మాన్ ను మరో కేసు వెంటాడుతోంది. అదే  కృష్ణజింకలను వేటాడిన కేసు. ఈ కేసులో ఇప్పటికే సల్మాన్ కు శిక్ష పడింది. అయితే అది కూడా సస్పెన్షన్ లో ఉంది. ఇతడి నేరం గురించి విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో సాక్షులను మళ్లీ విచారించాలనేది సల్మాన్ కోర్టుకు పెట్టుకొన్న విజ్ఞప్తి. కింది కోర్టులో సల్మాన్ కు వ్యతిరేకంగా సాక్షాలు నమోదయ్యాయి.
దీంతో శిక్ష పడింది. అయితే సల్లూ విచారణ మొదటి నుంచి జరగాలని అంటున్నాడు. సాక్షులను తిరిగి విచారించాలని కోరుతున్నాడు. అయితే రాజస్థాన్ హై కోర్టు దీనికి సమ్మతించలేదు. సాక్షులను మళ్లీ విచారించాలన్న సల్మాన్ విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. మరి ఈ పిటిషన్ తిరస్కరణ కు గురి కావడంతో… ఈ కేసులో పరిణామాలు సల్మాన్ కు వ్యతిరేకంగానే  పరిణమిస్తాయేమో అనే అనుమానాలు కలుగుతున్నాయి. దీంతో సల్లూ శిక్షను అనుభవించాల్సిందేనేమో అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయిప్పుడు. మరేం జరుగుతుందో!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -