Thursday, April 25, 2024
- Advertisement -

అనుష్క ‘సైజ్ జీరో’ సినిమా కథ అదేనా..?!

- Advertisement -

అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘సైజ్ జీరో’. దర్శకుడు కే రాఘవేంద్ర రావు తనయుడు ప్రకాష్ దర్శకత్వంలో… తెలుగు తమిళ భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో హీరో నాగార్జున ఒక ముఖ్యపాత్రలో కనిపించనున్నట్టుగా కూడా తెలుస్తోంది.

అనుష్క విజ్ఞప్తి మేరకే నాగ్ ఈ సినిమాలో నటిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ సినిమా కథ కథనాలకు సంబంధించి కూడా ఇప్పుడు ఆసక్తికరమైన విషయాలు తెలుస్తున్నాయి.
ఈ సినిమా పేరు ‘సైజ్ జీరో’. అయితే కథ ప్రకారం అనుష్క చాలా లావుగా ఉంటుందట. అలా లావుగా ఉన్న ఒక అమ్మాయి స్లిమ్ గా స్టైలిష్ గా ఉండే ఒక యువకుడి ప్రేమలో పడితే ఎలా ఉంటుంది? అనేది ఈ సినిమా కథ. అంటే వెనుకటికి వినాయకుడు వంటి సినిమాల కథేననమాట. వినాయకుడు సినిమా హీరో లావుగా ఉంటాడు. హీరోయిన్ బక్కపల్చగా ఉంటుంది.
వాళ్లిద్దరి మధ్య హైదరాబాద్ సిటీ లెవల్లో ఐటీ సెక్టార్ లో జరిగే కథే “వినాయకుడు”. ఇప్పుడు ‘సైజ్ జీరో”లో కథ రివర్స్. అమ్మాయి లావుగా ఉంటుంది.. అబ్బాయి స్టైలిష్ గా ఉంటాడు.  వాళ్లిద్దరి మధ్య నడిచే కథనే.. తెలుగు, తమిళ ప్రేక్షకులకు చూపనున్నారు. నాగార్జున ప్రత్యేక పాత్ర కూడా పోషిస్తున్నాడు కాబట్టి.. ఈ సినిమా ఎలా ఉంటుందో..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -