Monday, May 6, 2024
- Advertisement -

హైదరబాద్ లో ని హోటల్‌లో వ్యభిచారం.. హీరోయిన్ అరెస్ట్..!

- Advertisement -

సెక్స్ రాకెట్ కు సంబంధించి ఎన్నిసార్లు తనిఖిలు జరిగిన ఇవి మాత్రం ఆగడం లేదు. హైదరబాద్ నగరం కొన్ని అసాంఘిక కార్యకలపాలకు అడ్డగా మారుతోంది. బేగంపేటలోని పబ్ లో వ్యభిచార దందా గుట్టురట్టు చేసి ఒక రోజు కాకముందే నగరంలో మరో సెక్స్ రాకెట్ ను పోలీసులు పట్టుకున్నారు. బంజారాహిల్స్‌లోని ఓ ప్రముఖ హోటల్‌లో వ్యభిచారం చేయిస్తుండగా పోలీసులు రైడ్ చేసి పట్టుకున్నారు.

ముంబయికి చెందిన బాలీవుడ్ సెకండ్ గ్రేట్ హీరోయిన్‌తో పాటు ఓ సీరియల్ నటితో బంజారాహిల్స్‌లోని హోటల్‌లో వ్యభిచారం చేయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దాంతో వెంటనే ఆ హోటల్ పై రైడ్ చేశారు. సినీ తారతో పాటు కాస్టింగ్ డైరెక్టర్, ఈవెంట్ మేనేజర్‌ను అరెస్ట్ చేశారు. హోటళ్లలో ఈవెంట్ పేరుతో ఇతర రాష్ట్రాల నుంచి పలువురు హీరోయిన్లు, మోడల్స్‌ని రప్పించి వ్యభిచారం చేయిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు.

గతంలోనూ బంజారాహిల్స్‌లో భోజ్‌పురి, హిందీతో పాటు తెలుగు సినిమాలకు చెందిన పలువురు ద్వితీయ శ్రేణి హీరోయిన్లతో వ్యభిచారం చేయిస్తూ దొరికిన ఘటనలు ఉన్నాయి. తాజాగా బంజారాహిల్స్‌లో మరో లగ్జరీ సెక్స్ రాకెట్ బయటపడటంతో పోలీసులు మరింత నిఘా పెడుతున్నారు. కస్టమర్లను ఆకర్షించేందుకు నిర్వహకులు ఇతర రాష్ట్రాల నుండి అందమైన అమ్మాయిలను తీసుకొస్తున్నారని పేర్కొంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -