చిత్రలహరి సినిమాతో పర్వాలేదనిపించుకున్న సాయి ధరమ్ తేజ్ ఈ సారి పెద్ద హిట్ కొట్టాలని ప్రతిరోజూ పండగే సినిమాతో వచ్చాడు. మారుతీ దర్శకత్వంలో రాశీ ఖన్నా హీరోయిన్ గా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఈరోజే విడుదల అయ్యింది. మరి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
కథ :
సత్యరాజ్ లంగ్(ఊపిరితిత్తుల)క్యాన్సర్ తో బాధపడతారు. అతన్ని ఆఖరి రోజుల్లో సంతోషంగా ఉంచాలని యూఎస్ నుంచి సాయి తేజ్(సాయి ధరమ్ తేజ్) ఇండియాలోకి రాజమండ్రిలోని తన ఊరికి బలదేరుతాడు. అక్కడ నుంచే తన కుటుంబాన్ని ఒకే చోటుకు చేర్చాలని ప్లాన్ చేస్తాడు. అయితే ఈ క్రమంలో సాయి తేజ్ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కున్నాడు ? సత్య రాజ్ కి అసలు ఏమైంది ? పరిస్థితులన్నింటిని సాయి తేజ్ ఎలా హ్యాండిల్ చేసాడు ? ఇలాంటి తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ ఎప్పటిలానే అద్భుతంగా నటించాడు. రాశీ ఖన్నా తన అందంతో నటనతో ఆకట్టుకుంది. వీరిద్దరి మధ్య వచ్చే కామెడీ ట్రాక్స్ లవ్ సీన్స్ చాలా బాగున్నాయి. ఇక క్లైమాక్స్ లో ఎమోషనల్ సీన్ సహా ఇతర కీలకమైన ఎమోషన్స్ సాయి ధరమ్ తేజ్ అద్భుతంగా చేశాడు. ఇక ప్రీ క్లైమాక్స్ లో సిక్స్ ప్యాక్ ఫైట్ సీన్ తో అదరగొట్టాడు. మరో కీలక పాత్రలో కనిపించిన సత్య రాజ్ మంచి ఎనర్జిటిక్ గా మాత్రమే కాకుండా ఎమోషనల్ గా అద్భుతమైన నటన కనబర్చారు. రావు రమేష్ ఈ సారి కామెడీ సీన్స్ లో చించేశాడు. ఇక దర్శకుడు మారుతి ఎప్పటిలానే కామెడీ, ఎమోషన్స్ పై ఎక్కువ దృష్టి పెట్టాడు. అతను తెరకెక్కించిన విధానం బాగుంది. ఇక మిగతా నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు. సంగీతం అందించిన థమన్ డీసెంట్ బ్యాక్గ్రౌండ్ మరియు సాంగ్స్ అందించారు. జయకుమార్ అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
మైనస్ పాయింట్స్ : దర్శకుడు రొటిన్ కథనే తోనే సినిమాను లాక్కొచ్చారు. ఇక కథనం విషయంలో ఇంకాస్త శ్రద్ద పెట్టి ఉంటే బాగుండేది. ఎమోషన్స్ కూడా ఇంకాస్త బలంగా ఉంటే బాగుండేది.
మొత్తంగా : ఇక ఫైనల్ గా చుసుకుంటే.. ప్రతి రోజూ పండగే ఈ సినిమాలో ఎక్కువ కామెడీ పైనే దృష్టి పెట్టినట్టు అనిపిస్తుంది. కీలక సీన్స్ లో సాయి ధరమ్ తేజ్ చాలా బాగా చేశాడు. కథ, కథనం విషయంలో దర్శకుడు ఇంకాస్త శ్రద్ద పెట్టి ఉంటే బాగుండేది. మొత్తంగా ఫ్యామిలీతో కలిసి కాసేపు సరదాగా ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేయొచ్చు.
