హీరో శర్వానంద్ నటించిన మహానుభావుడు మూవీ ప్రస్తుతం టాలీవుడ్ బాజ్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. రెండు పెద్ద సినిమాలు జై లవకుశ, స్పైడర్ ఉన్నప్పటికి తన మహానుభావుడు సినిమా తో ఎక్కడ తగ్గకుండా కలెక్షన్లు రాబడుతున్నాడు. ఇప్పటికే అన్ని వర్గాల నుంచి ఈ సినిమాకి పాజిటివ్ టాక్ లభించింది. ఇక శర్వానంద్ ఈ సినిమాతో మరో హిట్ తన ఖాతలో వేసుకున్నాడు. అంతేకాకుండా ఓ మార్కెట్ ను కూడా శర్వానంద్ సెట్ చేసుకున్నాడు.
శర్వా నెక్స్ట్ సినిమాలు కూడా భారీ స్థాయిలో తెరకెక్కుతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. వరస హిట్స్ రావడంతో శర్వానంద్ భారీగా రెమ్యునరేషన్ పెంచినట్లు తెలుస్తోంది. సో మొత్తానికి శర్వానంద్ సినిమాలు అంటే.. ఖచ్చితంగా బాగుంటాయి అనే టాక్ అయితే వచ్చింది. ఓ స్థాయి స్టార్ హోదాను సంపాధించుకున్నాడు. మరి ఆ స్టార్ లుక్ మారుతుందో లేదో గాని ఒక్కటి మాత్రం అస్సలు మారదట. శర్వానంద్ హీరో కదా.. చాలా రాయల్ గా ఉంటాడని ప్రతి ఒక్కరు అనుకుంటారు. కానీ శర్వా వాడే ఫోన్ ని చూస్తే నిజంగా శర్వానంద్ ని మహానుభావుడు అనకుండా ఉండలేరు.
మాములుగా ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు స్మార్ట్ వాడుతున్న విషయం తెలిసిందే. ఇక మాములు వారు స్మార్ట్ ఫోన్ వాడుతుంటే.. సెలబ్రిటీలు అయితే ఖచ్చితంగా ఐఫోన్లో ఏ ఫోన్ వస్తే.. ఆ ఫోన్ వాడేస్తుంటారు. కానీ అందరికి భిన్నంగా శర్వానంద్ మాత్రం ఒక చిన్న కీ ప్యాడ్ ఉన్న నోకియా మొబైల్ ని వాడుతున్నాడట. ఈ సంగతిని మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఒక ఫోటో సాక్షిగా తెలిపాడు. ఎటువంటి యాప్స్ లేకుండా సోషల్ మీడియా దూరంగా ఉన్న శర్వాని చూస్తే నిజంగా మాహానుభావుడు అనుకుండా ఉండాలేం.
