- Advertisement -
బిసిసిఐ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన శశాంక్ మనోహర్ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కు చైర్మన్ గా ఎంపికయ్యారు. బిసిసిఐ అధ్యక్షునిగా ఉండాలని ఉన్నా ఐసిసి చైర్మన్ గా చేయాలని ఉందని వ్యాఖ్యానించిన శశాంక్ మనోహర్ చివరకు ఆ పదవిని చేపట్టారు.
ఇతర దేశాల బోర్డులతో కలిసి పనిచేస్తానని, ప్రపంచంలో క్రికెట్ అభివృద్ధికి పాటుపడతానని చెప్పారు. మంగళవారం నాడు బిసిసిఐ పదవికి రాజీనామా చేసిన శశాంక్ మనోహర్ గురువారం నాడు ఐసిసి చైర్మన్ గా ఎంపిక కావడం గమనార్హం. శశాంక్ మనోహర్ ఈ పదవిలో రెండేళ్లపాటు కొనసాగుతారు.