Friday, May 17, 2024
- Advertisement -

అల‌స్కా ఎయిర్‌లైన్స్‌లో జుక‌ర్ బ‌ర్గ్ అక్క‌కు వేధింపులు…

- Advertisement -

వేధింపులు భూమి మీద‌నే కాదు ఆకాశంలోనూ చేసేస్తున్నారు. బ‌స్టాప్‌లు, బ‌స్టాండ్‌లు, బ‌స్సులు, రైళ్ల‌ల్లో వేధింపుల‌కు పాల్ప‌డుతున్న ఆక‌తాయిలు విమానాల్లో కూడా వారి చేత ప‌ని కానిస్తున్నారు. చివ‌రికి ఫేస్‌బుక్ వ్య‌వ‌స్థాప‌కుడు జుక‌ర్ బ‌ర్గ్ సోద‌రిని కూడా వ‌ద‌ల‌లేదు. విమానంలో ప్ర‌యాణిస్తున్న ఆమెను ఒక‌డు అశ్లీలంగా ప్ర‌వ‌ర్తించాడు. ఆమె వేద‌న ప‌డుతూ సోష‌ల్ మీడియాలో పంచుకున్నారు.

ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్ సోదరి.. రాండి జుకర్ బర్గ్ లైంగిక వేధింపులకు గురయ్యారు. అలస్కా ఎయిర్‌లైన్స్‌లో ప్రయాణిస్తున్న రాండీతో ఆమె ముందు సీటులో ఉన్న వ్యక్తి అశ్లీలంగా ప్రవర్తించాడు. పదే పదే అదే మాదిరి ప్ర‌వ‌ర్తించ‌డంతో విసుగెత్తిన ఆమె విమాన సిబ్బందితో ఈ విషయం చెప్పారు. వాళ్లు కూడా అత‌డిని స‌పోర్ట్ చేసిన మాదిరి మాట్లాడ‌డంతో నిరుత్సాహ‌నికి గుర‌య్యింది. త‌న‌ను వేరో సీటులో కూర్చొమ‌ని ఉచిత స‌ల‌హా ఇచ్చార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసింది. తాను అదే సీటులో కూర్చున్నాన‌ని, ఎయిర్‌లైన్స్ సిబ్బంది నిర్ల‌క్ష్యం, అత‌డి తీరుపై కంప్ల‌యిట్ చేసింది. అలాంటి వారిపై కఠిన చర్యలు లేకపోతే… ఇలాంటి ఘటనలు కొనసాగుతూనే ఉంటాయన్నారు.

ఈ విష‌యాన్నిసోషల్ మీడియా వేదికగా తన గోడు వెళ్లబోసుకున్నారు. అంతేకాదు తనకు జరిగిన ఘటనను వివరిస్తూ ఎయిర్‌లైన్స్ అధికారులకు సుదీర్ఘ లేఖ రాశారు. దీనిపై అధికారులు కూడా స్పందించారు. చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హామీ ఇచ్చారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -