Monday, May 5, 2025
- Advertisement -

వైసీపీలోకి బూమా స‌న్నిహితుడు…. రాజీమాకు సిద్దంగా ఉండు శిల్పా స‌వాల్‌..

- Advertisement -
Shock to Akhila Priya.. Bhuma Follower Gopinath Reddy Join in YSRCP

నంద్యాల ఉప ఎన్నిక అంద‌రిలోను రోజు రోజుకి టెన్స‌న్ పెంచుతోంది. ఇరు పార్టీల‌నుంచి అభ్య‌ర్తుల‌ను ప్ర‌క‌టించ‌డంతో స‌వాల్లు …ప్ర‌తి స‌వాల్లతో నంద్యాల రాజ‌కీయాలు వేడెక్కాయి.

టీడీపీనుంచి వైసీపీలోకి మారిన శిల్పా మ‌మోహ‌న్‌రెడ్డికి రోజురోజుకి మ‌ద్ద‌తు పెరుగుతోంది.విజ‌యావ‌కాశాలు ఆయ‌న‌కే ఎక్కువ‌గా ఉన్నాయ‌ని ప‌లు స‌ర్వేలు కూడా స్ప‌ష్టం చేశాయి.

{loadmodule mod_custom,GA1}

అఖిలప్రియ తన సవాల్‌కు కట్టుబడి మంత్రి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉండాలని శిల్పా మోహన్ రెడ్డి సవాల్ విసిరారు. తాను ఓడిపోతే రాజకీయాల్లో నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని చెప్పారు. టీడీపీకి చెందిన మాజీ కౌన్సిలర్ బాలపక్కీరయ్య, మాజీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి సన్నిహితుడు గోపవరం గోపీనాథరెడ్డి బుధవారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.దీంతో అఖిల‌కు పెద్ద షాకేన‌ని రాజ‌కీయ వ‌ర్గాలు అంటున్నాయి.
టీడీపీ పతనం నంద్యాల నుంచే ప్రారంభమవుతోందని అన్నారు పార్టీలో చేరినగోపవరం గోపీనాథరెడ్డి అన్నారు . ఈ ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా తీసుకుంటామన్నారు. శిల్పా మోహన్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని అన్నారు.మాజీ కౌన్సిలర్ బాలపక్కీరయ్యతోపాటు ఆయన వర్గానికి చెందిన గఫూర్, రాజశేఖర్ గౌడ్, శ్రీనివాసులు గౌడ్, 150మంది కార్యకర్తలు శిల్పా సమక్షంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

{loadmodule mod_custom,GA2}

ఇలా రోజు రోజుకి మ‌ద్ద‌తు పెరిగిపోతుండ‌టంతో అఖిల ప్రియ వ‌ర్గం ఆందోళ‌న చెందుతున్నారు. పైకి టీడీపీకే మ‌ద్ద‌తు ఉంద‌ని చెప్పుకుంటున్నా క్షేత్ర‌స్థాయ‌లో అలా క‌నిపించ‌డంలేదు. భూమాకు స‌న్నిహితంగా ఉన్న వారంద‌రూ వైసీపీ తీర్థం పుచ్చుకోవ‌డంతో అఖిల‌కు గెలుపు అంత సులువు కాద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి.

{loadmodule mod_sp_social,Follow Us}
Also Read

{youtube}2yTeH45ljUY{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -