Saturday, April 20, 2024
- Advertisement -

నోరు జారిన అఖిల ప్రియ.. మారో ఇద్దరు పేర్లు..!

- Advertisement -

సంచలనం రేపిన బోయిన్‌పల్లి ప్రవీణ్‌రావు సోదరుల అపహరణకేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తుంది. అఖిల ప్రియను విచారించిన పోలీసులు… ఆమె నుంచి కీలక వివరాలు సేకరించారు. అందులో భాగంగా కేసులో భార్గవ్ రామ్ తమ్ముడు చంద్రహాస్, తల్లి కిరణ్మయి పాత్ర ఉన్నట్లు తేల్చారు. అపహరణ జరిగిన రోజు నిందితులు పారిపోయేంత వరకు వీరు సహాయం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో… అఖిల ప్రియ సోదరుడు జగత్‌విఖ్యాతరెడ్డి ప్రమేయంపై స్పష్టత రావాల్సి ఉంది.

ఏ-3గా ఉన్న భార్గవరామ్ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తూనే ఉన్నాయి. త్వరలోనే భార్గవ రామ్‌ సహా అతని తమ్ముడు చంద్రహాస్, తల్లి కిరణ్మయిని అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. తద్వారా మరిన్ని అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయని పోలీసులు భావిస్తున్నారు. ప్రధాన నిందితురాలిగా ఉన్న మాజీమంత్రి అఖిల ప్రియను కస్టడీ పూర్తికావడంతో న్యాయస్థానం ఆదేశాల మేరకు పోలీసులు… అమెను చంచల్​గూడ జైలుకు తరలించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -