Saturday, May 18, 2024
- Advertisement -

నీతులు చెప్తున్న శ్రుతి హాసన్

- Advertisement -

ప్రపంచ సినీ ప్రియుల దృష్టిని ఆకర్షించిన, అలరించిన ఘన చరిత్ర కలిగిన హీరో కమల్‍హాసన్. విలక్షణ నటుడు, విశ్వ నాయకుడు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పేర్లే ఉన్నాయి కమల్‌కు. అలాంటి పెద్ద స్టార్‌డమ్ ఉన్న కమల్‌హాసన్ కూతురు శృతిహాసన్. 

తను పెద్ద స్టార్ కూతురు అనే గర్వం లేకుండా వాళ్ళ నాన్న ఇమేజ్‌ని వాడుకోకుండా తనకంటూ ఒక ప్రత్యేకతను నటనలో చూపి ఇటు సౌత్, అటు నార్త్‌లో విజయవంతంగా దూసుకెళుతోంది. తెలుగు, తమిళ్ మరియు హిందీ చిత్రాలలో హీరోయిన్‌గా నటించిన మొదటి సినిమాలు ప్లాప్‌ అయ్యింది. అలాంటి సమయంలో తనకు ఐరన్‌లెగ్ అనే పేరు కూడా వచ్చింది. 

ఇదిలా ఉండగా.. ఇప్పుడు శృతి హాసన్ జీవితానికి సంబందించి నీతులు భోధిస్తోంది. జీవితం కంటే గొప్పది మరొకటి ఉండదంటోంది. హిట్స్, ప్లాప్స్ పేరు ప్రతిష్టలు ఇవన్నీ సర్వ సాధారణం. జీవితానికి మింఛింది మరోకటి లేదంటోంది. చిన్న చిన్న వాటీకే జీవితం పైన విరక్తి పెంచుకోకూడదు.. ఇలా చేసే వారికి జీవితపు విలువలు తెలియజేయాలని ఉంది అంటూ సెలవిచ్చింది.

గెలుపోటములు తాత్కాలికం అందుకోసం విలువైన జీవితాన్ని నాశనం చేసుకోకూడదు. దేవుడిచ్చిన జీవితాన్ని సంతోషంగా అనుభవించాలని హిత బోధ చేస్తోంది. మరి ఈ నీతులు అభిమానులైన చెవికి ఎక్కించుకుంటారేమో చూద్దాం.  

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -