Friday, May 10, 2024
- Advertisement -

చిరు కు పవన్ ఇచ్చే బర్త్‌డే గిఫ్ట్ ఇదేనా!?

- Advertisement -

మెగా ఫ్యామిలీలో అన్నయ్య చిరంజీవి, తమ్ముడు పవన్ కల్యాణ్ మధ్య విభేదాలున్నాయని.. అందుకే ఎవరి ఆడియో ఫంక్షన్‌కి ఒకరినొకరు హాజరు అవ్వరని భోగట్టా… ఇదంతా మెగా అభిమానులు జీర్ణించుకోలేక పోయేవారు. కానీ ఇప్పుడు ఆ వార్తలకు త్వరలో పవన్ కళ్యాణ్ తెరదించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇంతకీ మ్యాటరేంటంటే… పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ’గబ్బర్‌సింగ్” మూవీని చేస్తున్నాడు. 

ఈ సినిమా షూటింగ్ బిజీ షెడ్యూల్‌లో ఉన్న సంగతి తెలిసిందే.. ఈ చిత్రానికి సంబందించిన మొదటి షెడ్యూల్ పూనేలో పూర్తి చేసుకుందని, రెండో షెడ్యూల్ జూన్ 26 నుంచి ఆరంభమవుతుందని సమాచారం.  ఇదిలా ఉండగా… ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ ని పవన్ కళ్యాణ్ తన అన్నయ్య బర్త్‌ డే ఆగస్ట్ 22 న విడుదల చేసి, తన బర్త్‌డే గిఫ్ట్‌ గా సంకేతాలు పంపి వివాదాలకు తెర దించాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. 

ఇదే గనుక జరిగితే మెగా అభిమానుల్లో పండగ వాతావరణం ఏర్పడుతుంది. ఇన్ని రోజుల నుంచి మెగా ఫ్యామిలీలో విభేదాలు ఉన్నాయని వస్తున్న వార్తలకు తెరదించినట్లే అవుతుంది. దీంతో మెగా అభిమానులందరూ ఒకే తాటి పైకి వస్తారు. మరి పవర్ స్టార్ అనుకున్నది అనుకున్నట్లు చేస్తారో లేదో వేచి చూడాలి. ఇలా చేస్తే ముఖ్యంగా మెగా ఫ్యామిలీలో ఎలాంటి విభేదాలు లేవనే సంకేతాలు బయటికి వెళతాయి. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -