లాక్ డౌన్ సమయంలో ఎంతో మంది వలస కూలీలకు అండగా నిలిచి నేనున్నా అంటూ ముందుకు సాగారు బాలీవుడ్ నటుడు సోనూ సూద్. ఆయన చేసిన సేవలకు ఎంతో మంది ప్రశంసలు కురిపించారు. అపద్బాందువుడు, దేవుడిగా సోనూ సూద్ సేవలు పొందిన వారు తెగ పొగిడారు. అలా ఎంతో మందికి సేవలు అందించిన సోనూ సూద్ ని కూడా కరోనా వదలలేదు.

కరోనా బారిన పడీన సోనూ సూద్ కోలుకున్నారు. తాజాగా నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఆయనకు నెగెటివ్ వచ్చింది. అదే విషయాన్ని సోనూ సూద్ సోషల్ మీడియాలో ఓ ఫొటోతో సింబాలిక్ గా తెలిపారు. అయితే ఇప్పుడు సోనూ సూద్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. కరోనా కారణంగా 25 ఏళ్ల భారతి అనే అమ్మాయి బాధపడుతుండగా.. ఆమె పరిస్థితి విషమించింది దాదాపు 85-90% ఊపిరితిత్తులను కోల్పోయింది. నాగ్‌పూర్‌లోని వోక్‌హార్ట్ ఆసుపత్రికి తరలించారు. ఆమెకు ఊపిరితిత్తుల మార్పిడి లేదా ప్రత్యేక చికిత్స అవసరమని వైద్యులు చెప్పారు.

హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో మాత్రమే సాధ్యమని తెలుసుకున్న సోనూ సూద్ అపోలో ఆస్పత్రుల డైరెక్టర్లతో సంప్రదింపులు జరిపి… చికిత్స కోసం ఆమెను నాగ్ పూర్ నుంచి హైదరాబాదుకు ఎయిర్ అంబులెన్స్ ద్వారా వాయుమార్గంలో తరలించారు. అందుకైన ఖర్చును సోనూ సూద్ భరించారు.