Thursday, April 25, 2024
- Advertisement -

కరోనాతో సంగీత దర్శకుడు మృతి

- Advertisement -

కరోనా మహమ్మారి బాలీవుడ్‌లో మరో ప్రముఖుడిని బలితీసుకుంది. ప్రముఖ సంగీత దర్శకుడు శ్రావణ్ రాథోడ్ (66) కరోనాతో మృతి చెందారు. దేశ వ్యాప్తంగా రోజుకి మూడు లక్షల కేసులు నమోదు అవుతున్నాయంటే కరోనా ఉధృతి ఎంత ఘోరంగా ఉందో ప్రత్యేకంగ చెప్పనక్కరలేదు. వేల సంఖ్యలో మరణాలు సంబవిస్తున్నాయి. కరోనాతో సెలబ్రెటీలు సైతం చిగురుటాకుల్లా రాలిపోతున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు శ్రావణ్ రాథోడ్ (66) కరోనాతో మృతి చెందారు.

మరో సంగీత దర్శకుడు నదీమ్‌తో కలిసి శ్రవణ్ సంగీతాన్ని సమకూర్చేవారు. నదీమ్-శ్రావణ్ జంటగా బాలీవుడ్‌లో ఈ ద్వయం చిరపరిచితం. సూపర్ డూపర్ హిట్ చిత్రాలైన సాజన్, పరదేశ్, రాజా హిందూస్థానీ వంటి అనేక చిత్రాలకు వీరే సంగీతాన్ని అందించారు.

ఇటీవల ఆయనకు కరోనా సంక్రమించింది. ఆరోగ్యం క్షీణించడంతో ముంబైలోని ఎల్ఎల్ రహేజా ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స తీసుకుంటున్న ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో గత రాత్రి 10.15 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు సంజీవ్ వెల్లడించారు.

నేటి పంచాంగం, శుక్రవారం (23-04-2021)

పెళ్లి చేసుకొని ఒక్కటైన గుత్తా జ్వాల, విష్ణు విశాల్

‘జాతిరత్నాలు’ సీక్వెల్ రాబోతుందా

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -