Sunday, May 5, 2024
- Advertisement -

ప్రత్యేక హోదానే కాదు.. ఏపీకి ప్యాకేజీ కూడా లేనట్టే..!

- Advertisement -

మొన్నటి వరకూ ప్రత్యేక హోదా.. ప్రత్యేక హోదా.. అని ఊరడించారు. విభజన ప్రతిపాదన వచ్చినప్పటి నుంచే ఈ హోదా అంశం గురించి వార్తలు మొదలయ్యాయి.

ఏపీకి ఐదేళ్లు.. పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ, కాంగ్రెస్ వాళ్లు.. పోటాపోటీగా చెప్పుకొచ్చారు. అయితే కాంగ్రెస్ వాళ్లకు అధికారం చేతికి అందలేదు.. బీజేపీ వాళ్లకు అధికారం చేతికి అందినా ఏపీకి ఒరుగుతున్నది ఏమీ లేదు! మరి ఇప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా రాదని కేంద్రం స్పష్టం చేసింది.

ఆ విషయంలో ఏపీలోని పాలక తెలుగుదేశం పార్టీ ఎప్పుడో కాంప్రమైజ్ అయ్యింది. ఏపీకి ప్రత్యేక లేకపోతే లేకపోయిందిలే.. అన్నట్టుగాఉంది తెలుగుదేశం వ్యవహారం. మరి ఇప్పుడు ప్రతిపక్ష నేత జగన్ కు కేంద్రం రాసిన లేఖ తీరును చూస్తే.. ఏపీకి ప్రత్యేక హోదా మాత్రమే కాదు.. ప్యాకేజీ అనేది కూడా దక్కే అవకాశాలు లేవని స్పష్టం అవుతోంది. ప్రత్యేక హోదా కాదు.. ప్యాకేజీ అనేది ఉత్తుత్తిమాటేనని తెలుస్తోంది.

ఇన్ని రోజులూ ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా అంటూ బండి లాగించిన అధికార పార్టీ వాళ్లు.. మరి కొన్ని రోజుల పాటు ప్రత్యేక ప్యాకేజీ అంటూ బండిని లాగించడానికి ప్రిపేర్ అవుతున్నట్టుగా ఉన్నారు. ఇలాంటి మాటలతో ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నట్టుగా ఉన్నారు. ఆ తర్వాత అసలు విషయం చెప్పేసి.. చేతులు ఎత్తేస్తారేమో! 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -