Sunday, April 28, 2024
- Advertisement -

పవన్, ఎన్టీఆర్ తలపడతారా… మరి గెలిచేదెవ్వరో!

- Advertisement -

వచ్చే సంక్రాంతి పోరుకు రెడీ అవుతున్నారు పవన్ కల్యాణ్ , ఎన్టీఆర్ లు. పవన్ ఏమో ‘సర్ధార్ గబ్బర్ సింగ్ ‘ తో ఎన్టీఆర్ ఏమో ‘నాన్నకు ప్రేమతో’ తో రెడీ అయ్యారు. ఒకరేమో ప్యూర్ మాస్ ఎంటర్ టైనర్ తో మరొకరు క్లాస్ టైటిల్‌తో తలపడనున్నారు.

జనవరి ఎనిమిదితో తేదీన ఎన్టీఆర్ సినిమా విడుదల కానుండగా.. జనవరి పదో తేదీన పవన్ వస్తున్నాడని తెలుస్తోంది. మరి ఈ విధంగా ఈ ఇద్దరు పెద్ద హీరోల మధ్య పోరు షూరు కానుంది.

అయితే.. ఇప్పుడు పెద్ద హీరోల ఆశలన్నీ తొలివారం కలెక్షన్ల మీదే. వాటితో బయటపడితే పడినట్టు లేకపోతే లేదు. ఇలాంటి నేపథ్యంలో ఎన్టీఆర్, పవన్ లు కాంప్రమైజ్ అయ్యే అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే.. ఇలాంటి కాంప్రమైజ్ లు టాలీవుడ్ లో రొటీన్ అయిపోయాయి. రెండూ భారీ బడ్జెట్ సినిమాలే కాబట్టి.. ఒకరి క్షేమాన్ని మరొకరు దృష్టిలో పెట్టుకొని సినిమా విడుదలను రెండువారాల పాటు వేసుకొన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. ప్రస్తుతానికి అయితే డేట్లను ప్రకటించారు.

ఇంకా చాలా సమయం కూడా ఉంది. ఇలాంటి నేపథ్యంలో వీళ్ల మధ్య ఒప్పంద కుదిరి.. ఏదో ఒక సినిమా విడుదల సంక్రాంతి నుంచి శివరాత్రికి వాయిదా పడొచ్చు. అలా పడలేదంటే.. ఈ రెండు సినిమాలూ బాక్సాఫీసు వద్ద పెద్ద యుద్ధమే చేస్తాయి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -