Tuesday, May 21, 2024
- Advertisement -

సినిమా లవర్స్ గుండెను పిండేస్తున్న శ్రీదేవి మరణం…. ఎల్లెడలా వెల్లువెత్తుతున్న అభిమానం

- Advertisement -

ప్రముఖ నటి శ్రీదేవి మరణించారు. సౌత్ ఇండియన్ సినిమాలతో సూపర్ స్టార్‌గా ఎదిగి……ఆ తర్వాత బాలీవుడ్‌లో బ్లాక్ బస్టర్ హిట్స్‌తో భారతదేశంలోనే టాప్ రేంజ్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న శ్రేదేవి 54ఏళ్ళ వయసులో మరణించారు. ఒక పెళ్ళి కార్యక్రమానికి హాజరవడానికి భర్తతో కలిసి దుబాయ్ వెళ్ళిన శ్రీదేవి రాత్రి సమయంలో హార్ట్ ఎటాక్ రావడంతో మరణించారు. దాదాపు 11గంటల సమయంలో హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ శ్రీదేవి మరణించారు.

ఇప్పటికీ కూడా వరుసగా సినిమాల్లో యాక్ట్ చేస్తూ ఇంగ్లీష్ వింగ్లీష్, మామ్ లాంటి సినిమాలతో ఈ తరం ప్రేక్షకులను కూడా అలరిస్తూ ఉన్న శ్రీదేవి మరణం సినిమా అభిమానులను కలచివేస్తోంది. సెలబ్రిటీస్‌ని కూడా శోక సంద్రంలో ముంచుతోంది. దాదాపుగా సినిమా తెర పుట్టిన తర్వాత స్టార్ హోదా దక్కించుకున్న చాలా మంది సీనియర్ మోస్ట్ నటులతో కూడా నటించిన అనుభవం శ్రీదేవి సొంతం. అలాగే ఎప్పుడూ వివాదాలను దరిచేరనీయలేదు. బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్…..అనే తేడాల్లేకుండా అన్ని సినిమా పరిశ్రమల వ్యక్తులతోనూ శ్రీదేవికి చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. అందరి దగ్గరా మంచి పేరు తెచ్చుకున్న హీరోయిన్ శ్రీదేవి. ఈ తరం యువ దర్శకులు కూడా శ్రీదేవితో కలిసి పనిచేయడానికి చాలా ఉత్సాహం చూపిస్తారు. అలాగే నటిగా కూడా శ్రీదేవి అజరామరమైన చాలా పాత్రల్లో జీవించారు. అలాంటి శ్రీదేవి కేవలం 54 ఏళ్ళ వయసులోనే ఎవ్వరూ ఊహించని విధంగా గుండెపోటుతో మరణించడం సినిమా అభిమానులతో పాటు సెలబ్రిటీస్‌ని కూడా శోక సంద్రంలో ముంచింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -