Friday, May 3, 2024
- Advertisement -

రాజ‌కీయాల్లో మ‌రో సంచ‌ల‌నం..టీడీపీ,కాంగ్రెస్ క‌ల‌సిపోటీ..?

- Advertisement -

రాజ‌కీయాల్లో శాశ్వ‌త శ‌త్రువులు, శాశ్వ‌త మిత్రులు ఉండ‌ర‌నేది చాలా సంద‌ర్భాల్లో నిరూపితం అయ్యింది. బ‌ద్ద శ‌త్రువులుగా ఉన్న పార్టీలుకూడా ఎన్నిక‌ల్లో క‌ల‌సి పోటీచేయ‌డం చూశాం. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో అలాంటి ఘ‌ట‌నే చోటు చేస‌కుంటుంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఒక వేల జ‌రిగినా ఆశ్చ‌ర్య పోవాల్సిందిలేదు.

వచ్చే ఎన్నికల్లో రాజకీయ సమీకరణలకు తెరలేచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. విశ్వీసనీయవర్గాల చెప్పే ప్రకారం వచ్చే ఎన్నికల్లో టిడిపి-కాంగ్రెస్ లు పొత్తులు పెట్టుకునే అవకాశాలున్నాయి. వినటానికే ఏదోలా ఉన్నా, నమ్మశక్యంగా లేకున్నా తెరవెనుక ప్రయత్నాలైతే జరుగుతున్నాయన్నది వాస్తవం.

టీడీపీతో క‌లిసేదిలేద‌ని కావాలంటే టీఆర్ఎస్‌లో పార్టీనీ విలీనం చేయండంటూ కెసిఆర్ స్పష్టంగా చెప్పారట. టిడిపి నేతలకు అదే బాగుంటుందని అనిపించే భేటీ తర్వాత పొత్తు కాదు విలీనమే అంటూ బాహాటంగా వాదించటం మొదలుపెట్టారు.

ఇదే విష‌యాన్ని చంద్ర‌బాబు ద‌గ్గ‌ర ప్ర‌స్తావించిన‌పుడు పార్టీని టిఆర్ఎస్ లో విలీనం చేయటానికి అంగీకరించలేదట. ప్రస్తుతం తెలంగాణాలో టిడిపి ఇబ్బందుల్లో ఉన్నా భవిష్యత్తులో పుంజుకునే అవకాశం లేకపోలేదన్నది చంద్రబాబు ఉద్దేశ్యం. టిడిపితో పొత్తుకు కెసిఆర్ అంగీకరించటం లేదు. టిడిపితో కలిసి ఎన్నికల్లో పోటీ చేయటానికి బిజెపి ఇష్టపడటం లేదు. ఇక మిగిలింది ఒకే ఒక ఆప్షన్. అది కాంగ్రెస్ తో కలవటమే. కాంగ్రెస్, టిడిపిలకు టిఆర్ఎస్ ఉమ్మడి శతృవన్న విషయం అందిరికీ తెలిసిందే. తెలంగాణాలో అక్కడక్కడ జరిగిన జడ్పిటిసి, ఎంపిటిసి, మున్సిపల్ ఎన్నికల్లో టిడిపి, కాంగ్రెస్ కలిసి పోటీ చేసి టిఆర్ఎస్ ను ఓడించిన విషయం మరచిపోకూడదు.

కాబట్టి టిఆర్ఎస్ ను ఎదుర్కోవటానికి టిడిపి, కాంగ్రెస్ లు చేతులు కలిపే అవకాశాలున్నాయి. ఇదే విషయాన్ని తెలంగాణాలోని ఓ టిడిపి ఎంఎల్ఏ చెప్పిన‌ట్లు స‌మాచారం.వచ్చే సాధారణ ఎన్నికల్లో టిడిపి-కాంగ్రెస్ పొత్తులుండే అవకాశాలున్నాయ’న్నారు. ‘ఒక్క తెలంగాణాలో మాత్రమే కాదని ఏపిలో కూడా కలిసి పోటీ చేస్తాయ’న్నారంట‌. దీనిలో ఎంత‌నిజ‌ముందో తెలియాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -