Thursday, May 16, 2024
- Advertisement -

హైద‌రాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో బిల్డింగ్ కొనిచ్చిన స్టార్ పొలిటీషియ‌న్‌..?

- Advertisement -

సినిమా వాళ్లకు రాజకీయనాయకులకు మధ్య సాన్నిహిత్యం బాగానే ఉంటుంది.ప్ర‌తీపార్టీకీ సినీ గ్లామ‌ర్ ఉండాల్సిందే. త‌మ రాజ‌కీయ ప్ర‌చారాల‌కోసం సినిమా హీరోయిన్ల‌ని వాడుకోవ‌డం స‌మ‌జం. అయితే నిన్న జ‌రిగిన తెలంగాణా ఎన్నిక‌ల నేప‌థ్యంలో స్టార్ పొలిటీషియన్ ఎఫైర్ బయటపడింది.

ఎన్నిక‌ల స‌మ‌యంలో అపోజిష‌న్ పార్టీ నాయ‌కుల‌ను ఇబ్బంది పెట్ట‌డానికి, వారిపై బుద‌ర జ‌ల్ల‌డానికి వారి చీక‌టి బాగోతాలు బ‌య‌ట‌పెట్ట‌డం చూస్తూనే ఉన్నాం.ఇదే క్ర‌మంలో స్టార్ పొలిటీషియన్ ఓ స్టార్ హీరోయిన్ తో ఎఫైర్ సాగిస్తున్నాడని తెలియడంతో ఒక్కసారిగా ఇండస్ట్రీ షాక్ అయింది.

సదరు పొలిటీషియన్ కి యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఈ పొలిటీషియన్ గతంలో కూడా ఓ హీరోయిన్ తో ఇలాంటి వ్యవహారాలు సాగించాడు. ఇప్పుడు ఆమె మరో ఇండస్ట్రీలో సెటిల్ అవ్వడంతో కొత్త హీరోయిన్ ని పట్టాడు.

ఆమెకి హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో బిల్డింగ్ కొనిచ్చి కావాల్సిన వసతులన్నీ సమకూర్చినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఆ విషయం పార్టీ శ్రేణుల్లో జోరుగా సర్క్యులేట్ అవుతుంది. ఈనెల 11న ఎన్నిక‌ల ఫ‌లితాలు ఉన్న నేప‌థ్యంలో ఎఫైర్ విష‌యాలు బ‌య‌ట‌కు రాకుండా చూసుకుంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -