Friday, May 17, 2024
- Advertisement -

వైఎస్‌పై సూపర్ స్టార్ ప్రశంశల వర్షం…… 2019లో జగనే సిఎం

- Advertisement -

స్వర్గీయ వైఎస్ రాజశేఖరరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంది. వైఎస్‌కి ఉన్న ప్రజాదరణ……. ఆ ప్రజల కోసం చివరి క్షణాల్లో కూడా వైఎస్ పడిన తాపత్రయం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆ ప్రజలకు సేవ చేయడం కోసమే తన చివరి ప్రయాణాన్ని కూడా పెట్టుకున్న ఒకే ఒక్క నాయకుడు వైఎస్. ఇప్పుడు ఆ వైఎస్ రాజశేఖరరెడ్డితో తనకు ఉన్న అనుబంధం గురించి సుదీర్ఘంగా చెప్పుకొచ్చాడు సూపర్ స్టార్ కృష్ణ. ఇద్దరం ఒకే సమయంలో పార్లమెంట్‌లో ఎంపిలుగా ఉన్నప్పటి నుంచీ మంచి అనుబంధం ఉందని ఆ తర్వాత స్నేహంగా మారిందని చెప్పుకొచ్చాడు.

ఒక మనిషిని ప్రేమగా చూడడంలో వైఎస్ తర్వాతే ఎవరైనా అని చెప్పుకొచ్చాడు. అలాగే మాట మీద నిలబడిన నాయకుడు, ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన నాయకుడు వైఎస్ అని అభినందించాడు సూపర్ స్టార్ కృష్ణ. వైఎస్ ప్రవేశ పెట్టిన అన్ని పథకాలూ తనకు ఇష్టమేనని…….అన్నీ పేదలకు, ప్రజలకు మంచి చేసినవేనని చెప్పుకొచ్చాడు.

ఇక రోళ్ళు పగిలే స్థాయి ఎండల్లో ప్రజల కోసం పాదయాత్ర చేయడం మామూలు విషయం కాదని…….అలాగే ప్రజలు కూడా జగన్ కోసం ఎండలను సైతం లెక్క చేయకుండా రోడ్ల పైకి రావడం గొప్పగా అనిపిస్తోందని చెప్పుకొచ్చాడు కృష్ణ. 2019 ఎన్నికల్లో వైకాపానే గెలుస్తుందని, వైఎస్ జగనే సిఎం అవుతాడని ఘంటాపథంగా చెప్పాడు కృష్ణ. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో వైఎస్‌లను మించిన నాయకులు ఎవ్వరూ లేరని పరోక్షంగా చంద్రబాబు వైఫల్యాలను ప్రస్తావించాడు. సూపర్ స్టార్ మాటలు వైకాపా శ్రేణుల్లో ఉత్సాహాన్ని పెంచుతున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -