Monday, May 5, 2025
- Advertisement -

కారుణ్య మ‌ర‌ణంపై సుప్రీకోర్టు సంచ‌ల‌న తీర్పు….

- Advertisement -

కారుణ్య మ‌ర‌ణంపై సుప్రీంకోర్టు సంల‌న‌తీర్పు వెలువ‌రించింది. విధిలేని పరిస్థితుల్లో గత్యంతరం లేక మరణించాలని భావించే వారికి వారు కోరిన అవకాశాన్ని దగ్గర చేయాలని సుప్రీంకోర్టు కీలక రూలింగ్ ఇచ్చింది. స్వచ్ఛంద మరణంపై దాఖలైన పిటిషన్ ను విచారించిన ధర్మాసనం అందుకు అనుమతించింది.

ఇప్పటికే స్వచ్ఛంద మరణంపై నియమ నిబంధనలను తయారు చేసిన కేంద్రం దాన్ని కోర్టుకు అందించగా, విచారించిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం, కొద్దిసేపటి క్రితం తీర్పును వెలువరించింది. బతికేందుకు ఎటువంటి మార్గమూ లేదని అన్ని విధాలుగా తేలిపోయిన తరువాత, స్వచ్ఛంద మరణాన్ని కోరుకునే హక్కు న్యాయమైన హక్కేనని పరిగణిస్తున్నామని ధర్మాసనం పేర్కొంది. పౌరులకు గౌరవంగా మరణించే హక్కు ఉందని అభిప్రాయపడ్డ న్యాయమూర్తులు, విధివిధానాలకు తగ్గట్టుగా వారు తమ కోరికను తీర్చుకోవచ్చని స్పష్టం చేశారు.

రోగి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, వ్యాధి నయం కాదని చట్టబద్ధ మెడికల్‌ బోర్డు ప్రకటించిన అనంతరమే లైఫ్‌ సపోర్ట్‌ వ్యవస్థను తొలగించాలని ధర్మాసనం పేర్కొంది. తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న రోగులు తమకు ఎలాంటి వైద్య చికిత్స కావాలో వైద్యులకు తెలుపుతూ లివింగ్‌ విల్‌ సమర్పించేందుకు కోర్టు అనుమతించింది. లివింగ్‌ విల్‌, పాసివ్‌ యుతనేసియా అమలుకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రాణాంతక వ్యాధులతో జీవచ్ఛవాలుగా మారిన రోగులకు కారుణ్య మరణాలను ప్రసాదించాలనే చర్చ దీర్ఘకాలంగా సాగుతున్నది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -