Thursday, May 2, 2024
- Advertisement -

ఏపీ హైకోర్టు తాత్కాలిక న్యాయ‌మూర్తిగా జ‌స్టిస్ ప్రవీణ్ కుమార్ నియామ‌కం..

- Advertisement -

ఎట్ట‌కేల‌కు ఉమ్మ‌డి హైకోర్టు విభ‌జ‌న జ‌రిగింది. రెండు తెలుగు రాష్ట్రాల‌కు వేర్వేరుగా ప్ర‌త్యేక హైకోర్టుల‌ను ఏర్పాటు చేస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేష‌న్‌ను విడుద‌ళ చేసిన సంగ‌తి తెలిసిందే. న్యామూర్తుల‌ను కూడా కేటాయించింది. ఏపీ హైకోర్టు తాత్కాలిక చీఫ్ జస్టిస్ గా ప్రవీణ్ కుమార్ ని నియమించారు. ఈ మేరకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు.

జనవరి 1 నుంచి తాత్కాలిక చీఫ్ జస్టిస్ గా ప్రవీణ్ కుమార్ విధులు నిర్వహిస్తారని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆయ‌న నేప‌థ్యం చేసుకుంటే 1961 ఫిబ్రవరి 26వ, తేదీన హైద్రాబాద్‌ లో ప్రవీణ్ కుమార్ జన్మించారు. హైద్రాబాద్ లిటిల్‌ఫ్లవర్ స్కూల్‌లో ఉన్నత విద్యను పూర్తి చేశారు. నిజాం కాలేజీలో బీఎస్సీని పూర్తి చేశారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీలో లా పూర్తి చేశారు.

1986లో న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించారు. 2012లో ఏపీ హైకోర్టులో అడిషనల్ జడ్జిగా, పూర్తి స్థాయి జడ్జిగా 2013లో నియమితులయ్యారు. క్రిమినల్ లాయర్ గా ప్రవీణ్ కుమార్ కు మంచిపేరు ఉంది. వచ్చే ఏడాది (2019) జనవరి 1వ తేదీ నుండి అమరావతిలో ఏపీ రాష్ట్ర హైకోర్టు పని చేయనుంది. ఇప్పటికే ఏపీ రాష్ట్రానికి 16 మంది జడ్జిలను, తెలంగాణకు 10 మంది జడ్జిలను కేటాయిస్తూ బుధవారం నాడు రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -