ఏపీలో సాషియల్ మీడియాపై చంద్రుబాబు ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే.తనకు వ్యతిరేకంగా సోషియల్ మీడియాలో వార్త వచ్చినా ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకుంటోంది.చంద్రబాబు ప్రభుత్వాన్ని నడుపుతున్న తీరుపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈమేరకు .
తక్షణం ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలనిరాష్ట్రపతి, ప్రధాని నరేంద్రమోడీకి కట్జూ లేఖ రాశారు. అయితే ఇప్పుడు ఈలేఖ నెటిజన్లకు మరింత బలాన్ని ఇస్తోంది.ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కార్టూన్లు వేస్తున్నారన్న ఆరోపణలపై కార్టూనిస్ట్ రవికిరణ్‌తో పాటు నెటిజన్లను చంద్రబాబు అరెస్ట్ చేయించిన నేపథ్యంలో మార్కండేయ కట్జూ తీవ్రంగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఒక నియంతృత్వ, అప్రజాస్వామిక పాలన నడుస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వాలను విమర్శిస్తూ కార్టూన్లు వేయడం ఆర్టికల్ 19(1)ఏ ప్రకారం రాజ్యాంగం ప్రసాదించిన హక్కుఅన్నారు.
కార్టూనిస్ట్ రవికిరణ్ అరెస్ట్ ముమ్మాటికి అప్రజాస్వామికమేనన్నారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ పాలన సాగిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం కొనసాగేందుకు అర్హత లేదన్నారు. అనాగరిక పాలన నుంచి ప్రజలను కాపాడేందుకు రాష్ట్రపతి పాలన విధించాలని కోరారు. ఏపీ అసెంబ్లీని రద్దు చేసి.. ఆర్టికల్ 356 ప్రకారం తక్షణం మధ్యంతర ఎన్నికలు నిర్వహించాలని కట్జూ డిమాండ్ చేశారు.
Related