Friday, May 17, 2024
- Advertisement -

చంద్ర‌బాబు వ్యూహానికి… శిల్పా,భూమా వ‌ర్గాలు మ‌టాషేనా..!

- Advertisement -
Suspence continues on nandyal by poll candidates

నంద్యాల ఉప ఎన్నిక టికెట్ అభ్య‌ర్తి ఎర‌నే విష‌యంలో బాబు అడుతున్న నాట‌కంలో అంద‌రూ పావులేనా…? అంద‌రిలోనూ దీనిమీద ఉత్కంఠ నెల‌కొంటె బాబులో మాత్రం అది ఎక్క‌డా క‌నిపించ‌డంలేదు. టికెట్టు విష‌యంలో ఒక క్లారిటీ ఇవ్వ‌కుండా నంద్యాల టీడీపీ నాటకాన్ని’ అత్యద్భుతంగా నడిపించేస్తున్నారు.

ఇరు వ‌ర్గాల‌తోనూ సంప్ర‌దంపుల జ‌రుపుతూ ఎవ‌రి మ‌న‌సులో ఏముంది…టికెట్టు ఇస్తే ప‌రిస్థిత‌లు ఎలా ఉంటాయ‌ని అంచ‌నా వేస్తున్న‌ట్లు స‌మాచారం.నంద్యాల ఉప ఎన్నికలో ఎవరు పోటీ చేయాలనే విషయమై చంద్రబాబు, ఇటు మంత్రి అఖిలప్రియనీ, అదే సమయంలో శిల్పా మోహన్‌రెడ్డి ఇద్ద‌రినీ ‘ఆశల పల్లకీ’లో విడివిడిగా విహ‌రించేలా చేస్తుంటే …. స్థానికి నాయ‌క‌త్వం నాట‌కాన్ని మ‌రింత‌గా రక్తిక‌ట్టిస్తోంద‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి.
ఇక మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో ప‌ద‌వులు కోల్పోయిన పల్లె రఘునాథ్‌రెడ్డిని , బొజ్జల గోపాలకృష్ణ మంత్రి పదవి నుంచి తొల‌గించిన‌పుడు వారి చేసిన నాట‌కాలు బాబు ముంద‌ర సాగ‌లేదు. రెండు మూడు రోజుల త‌ర్వాత అంద‌రూ మెత్త‌బ‌డ్డారు. ఇప్పుడు కూడా వారి ప‌రిస్థితి అదేకావ‌చ్చు. అధిష్టానాన్ని ఎంత ధిక్క‌రించినా చివ‌రికి బాబు చెప్పిన‌ట్టే న‌డుచుకోవ‌డం మామూలే. నంద్యాల ఉప ఎన్నిక అభ్య‌ర్తి ఎవ‌ర‌న్న‌ది ముందుగానే చంద్రబాబు మైండ్‌లో ఫలానా వ్యక్తి నంద్యాల అభ్యర్థి.. అని ఎప్పుడో ఫిక్స్‌ అయిపోయి వుంటుంది. ఎవ‌ర‌నేది బ‌య‌ట‌కు ప్ర‌క‌టించ‌కుండా ఇరు వ‌ర్గాల‌ను బాబు ఊరిస్తున్నారు.
సినిమా క్లైమాక్స్‌ను ముందుగానే చెప్తే ఆసినిమా మీద ఎవ‌రూ ఆస‌క్తిని చూప‌రు…అదే విధంగా ఇప్ప‌డు నంద్యాల ఉఎన్నిక టికెట్ అభ్య‌ర్తి ఎవ‌ర‌నే మూవీ ఇంకా క్లైమాక్స్‌కు చేర‌లేదు. నాట‌కం రక్తి క‌ట్టాలంటే దాన్ని సాగ‌దీయాలి. చివ‌రి వ‌ర‌కూ టికెట్టు అభ్య‌ర్తి ఎవ‌ర‌ని ఊరించి ….ఊసురుమ‌నిపించడంలో అకిక్కే వేర‌ప్పా అన్న‌ట్లు ఉంది చంద్ర‌బాబు ఆలోచ‌న‌. ఇలాంటి బెదిరింపులు బాబు ఎన్నిచూసిండ‌రు చెప్పండి.
నంద్యాల అభ్య‌ర్తి విష‌యంలో ఇప్పుడూ అదే జరుగుతోంద‌ని రాజ‌కీయ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. అదును చూసి దెబ్బ‌కొడితే ….ఇక తేరుకోవ‌డానికి నెల‌లు ప‌డుతుంది. ఇప్పుడు బాబు కూడా అదే చేయ‌బోతున్నారు. వైసీపీ వైపు వెల్తాన‌ని శిల్పా మోహన్‌రెడ్డి బెదిరింపులు …. మ‌రో వ‌పై భూమా అనుచ‌ర వ‌ర్గానికి ప‌ట్టులేకుండా చేయ‌డాని బాబు ర‌చించిన వ్యూహంగా భావించాలా..? అన్న అనుమానాలు క‌లుగుతున్నాయి. అవ‌స‌ర‌మైన‌ప్పుడు ఉప‌యేగించుకొని వారిని దూరంగా పెట్ట‌డం రాజ‌కీయాల‌లో మామూలే. దీనిపై ఒక క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.. ఒక్కటి మాత్రం నిజం అంటున్నాయి రాజ‌కీయ వ‌ర్గాలు.. బాబు అడుతున్న ఎపిసోడ్‌తో ఇటు శిల్పా వర్గం, అటు భూమా వర్గం.. కర్నూలు జిల్లాలో వారి ప్ర‌మేయాన్ని లేకుండా చేయాల‌నే చంద్రబాబు అసలు సిసలు వ్యూహంలా క‌నిపిస్తోంద‌.

{loadmodule mod_sp_social,Follow Us}

{youtube}csvrVVp738I{/youtube}

Also Read

  1. ఉప ఎన్నికలకు ముందే.. అఖిల ప్రియకు చుక్కలు చూపిస్తున్నారు
  2. టీడీపీకీ భ‌విష్య‌త్తు ఆశా కిర‌ణం బ్రాహ్మ‌ణేనా..?
  3. అనుచ‌రుల ఒత్తిడితో ఎటూతేల్చుకోలేక పోతున్న భూమాఅఖిల ప్రియారెడ్డి
  4. నంద్యాల ఉప ఎన్నిక టికెట్‌..ఉత్కంఠ‌కు తెర‌ప‌డేదెప్పుడు….?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -