రజనీకాంత్ భార్యకు జైలు శిక్ష‌ త‌ప్ప‌దా?

త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ భార్య‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ త‌గిలింది. ఓ యాడ్ బ్యూరో అడ్వర్టైజింగ్ కంపెనీకి చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని ఆమెను సుప్రీంకోర్టు ఆదేశించింది. తీసుకున్న‌ మొత్తాన్ని లతా ఇంకా చెల్లించకపోవడంతో సుప్రీంకోర్టు ఆమెపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. యాడ్ బ్యూరో నుంచి మీడియా వన్ సంస్థ రూ. 10 కోట్ల రుణం తీసుకుంది. మీడియా వన్ సంస్థకు లతా రజనీకాంత్ డైరెక్టర్‌గా ఉన్నారు.

ఇప్ప‌టి వ‌ర‌కు మీడియా వన్ సంస్థ వారు ఒక్క రూపాయి కూడా ఇవ్వ‌క‌పోవ‌డంతో యాడ్ బ్యూరో వారు సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. దీంతో సుప్రీంకోర్టు ల‌త ర‌జ‌నీ వెంట‌నే తీసుకున్న డ‌బ్బును వ‌డ్డీతో స‌హా చెల్లించాల‌ని ఆదేశించింది. లేక‌పోతే ఆమెకు జైలు శిక్ష త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రించిన‌ట్లు సమాచారం.