తెలంగాణా డిప్యూటీ స్పీక‌ర్‌గా ప‌ద్మారావు గౌడ్‌..

కేటీఆర్ దౌత్యంతో తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా ఎమ్మెల్యే పద్మారావుగౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు నామినేషన్ల గడువు శనివారంతో ముగిసింది. ఆ స‌మ‌యానికి ప‌ద్మారావు గౌడ్ త‌ప్ప ఎవ‌రూ నామినేష‌న్ వేయ‌క‌పోవ‌డంతో డిప్యూటీ స్పీక‌ర్‌గా ఎన్నికైన‌ట్లు స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్ర‌క‌టించారు. డిప్యూటీ స్పీకర్ ఎన్నికపై ఏకాభిప్రాయ సాధనకు అధికార పార్టీ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. అనంతరం పద్మారావుగౌడ్‌ను సీఎం కేసీఆర్, ప్రతిపక్ష సభ్యులు కలిసి తీసుకెళ్లి సీట్లో కూర్చొబెట్టారు. ఈ సందర్భంగా పద్మారావుగౌడ్‌కు స్పీకర్ పోచారం, సీఎం కేసీఆర్, ఇతర సభ్యులు అభినందనలు తెలియజేశారు. నూనత ఉపసభాపతిని సీఎం కేసీఆర్‌, ప్రతిపక్ష నేత మల్లు భట్టివిక్రమార్క సభాపతి స్థానంలో కూర్చోబెట్టారు. 2014 నుంచి 2018 వరకు పద్మారావు ఎక్సైజ్, అబ్కారీ మరియు క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేశారు