Sunday, April 28, 2024
- Advertisement -

అస్కార్ రేసులో స‌త్తా చాటిన ఇండియ‌న్ సినిమా

- Advertisement -

హాలీవుడ్ ప్ర‌తీష్టాత్మకంగా నిర్వ‌హించే అస్కార్ అవార్డుల ఈవెంట్ క‌న్నుల పండుగా జరిగింది. మ‌న తెలుగు న‌టుల‌కు నంది అవార్డ్స్ ఎలాగో , హాలీవుడ్ న‌టుల‌కు అస్కార్ అవార్డు అలాగా. అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో 91వ ఆస్కార్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తాజాగా 2018గాను బెస్ట్ సినిమా, న‌టీ,న‌టులకు అవార్డుల‌ను ప్ర‌క‌టించారు. దీనిలో భాగంగానే ఉత్త‌మ విదేశి చిత్రంగా ఇండియ‌న్ సినిమా త‌న స‌త్తాను చాటింది. ‘పీరియడ్: ఎండ్ ఆఫ్ సెంటెన్స్’ అనే డాక్యుమెంటరీ చిత్రానికి ఆస్కార్ లభించింది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత గునీత్ మోంగా నిర్మించిన సంగ‌తి తెలిసిందే.

ఈ చిత్రానికి రేకా జెహ్ తాబ్చి దర్శకత్వం వహించారు. భార‌త స్త్రీలు ఎదుర్కొంటున్న రుతుక్రమ సమస్యల గురించి ఈ సినిమాలో చూపించారు. 25 నిమిషాల నిడివి గల ఈ డాక్యుమెంటరీని యూపీలో చిత్రీకరించారు. డాక్యుమెంటరీలో రుతుక్రమ స‌మ‌యంలో మ‌హిళ‌లు ప్యాడ్లు ,న్యాప్కిన్లు ఎలా వాడుతారో చూపించారు.గ‌తంలో చాలా ఇండియాన్ సినిమాలు అస్కార్‌కు నామినేట్ అయిన‌ప్ప‌టికి , అవార్డును మాత్రం సొంతం చేసుకోలేక పోయ్యాయి. కాని ఈ సినిమా మాత్రం అస్కార్ అవార్డు సాధించి చ‌రిత్ర సృష్టంచింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -