- Advertisement -

పాక్ భవిష్య‌త్తు ప్ర‌శ్నార్థ‌క‌ర‌మేనా….?

- Advertisement -
Table bill to revoke islamabads ally status

పాకిస్థాన్ ప్ర‌త్యేక అమెరికా ఇచ్చే ప్ర‌త్యేక‌హోదా కోల్పోనుందా..? డిఫెన్స్ స‌హకారం, ఆయుధాల కొనుగోలుకు బ్రేక్ ప‌డ‌నుందా..? అమెరికా ఎందుకు ఈ క‌టిన నిర్న‌యం తీసుకుంటోంది? అమెరికా స‌హాయం లేకుంటె భ‌విష్య‌త్ ఏంటి? కార‌నాలు ఏంటి..?

ఉగ్ర‌వాదానికి కేరాఫ్‌గా నిలిచిన పాక్‌కు ఇప్పుడు చుక్క‌లు క‌నిపించ‌నున్నాయి.తీవ్ర‌వాద‌ముసుగులో నాట‌కాలాడుతున్న దాయాది దేశంకు పోటుత‌ప్ప‌దు.ఇన్నాల్లు అమెరికానుంచి పొందుతున్నడిఫెన్స్ స‌హకారం, ఆయుధాల కొనుగోలుకు రుణం లాంటి స‌దుపాయాల‌ను త్వ‌ర‌లో పాకిస్థాన్ కోల్పోనుంది.

{loadmodule mod_custom,GA1}

ఇన్నాళ్లూ పాకిస్థాన్‌కు ఉన్న మిత్ర దేశం హోదాను ర‌ద్దు చేయాల‌ని ఆ దేశ చ‌ట్ట‌ప్ర‌తినిధులు టెడ్ పో, రిక్ నోలాన్ ఓ బిల్లును ప్ర‌వేశ‌పెట్టారు. పాకిస్థాన్‌కు అమెరికా 13 ఏళ్ల కింద‌ట‌ మేజ‌ర్ నాన్ నాటో అలీ (ఎంఎన్ఎన్ఏ) హోదాను ఇచ్చింది. అయితే అమెరికాకు పాకిస్థాన్ వెన్నుపోటు పొడిచింద‌ని, అమెరికాకు అంటిన నెత్తుటి మ‌ర‌క‌లు పాక్ ప‌నేన‌ని ఈ ఇద్ద‌రూ ఆరోపించారు
అందుకే పాక్‌తో ఉన్న అన్ని సంబంధాల‌ను అమెరికా తెంచుకోవాల‌ని ఆయ‌న స్ప‌ష్టంచేశారు. అమెరికా చేతుల‌కు అంటిన ర‌క్త‌పు మ‌ర‌క‌లకు పాకిస్థానే బాధ్య‌త వ‌హించాల‌ని టెడ్ పో అన్నారు. 2004లో అప్ప‌టి అధ్య‌క్షుడు జార్జ్ బుష్‌.. పాక్‌కు ఎంఎన్ఎన్ఏ హోదా ఇచ్చారు. అల్‌ఖైదా, తాలిబ‌న్‌కు వ్య‌తిరేక పోరాటంలో పాక్ సాయం కోరుతూ ఆయ‌న ఈ హోదా ఇచ్చారు.
ముఖ్యంగా విదేశీ గ్రాంట్లు, ర‌క్ష‌ణ స‌హ‌కారాల్లో పాకిస్థాన్‌కు భారీగా ల‌బ్ధి చేకూరేది. ర‌క్ష‌ణ పరిక‌రాల అమ్మ‌కాల్లో ఈ దేశాల‌కు తొలి ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడా హోదా పోతే.. పాకిస్థాన్ దిక్కులేనిదవుతుంది.మ‌రిన్ని క‌ష్టాలు పాక్‌ను వెంటాడనున్నాయి.

{loadmodule mod_custom,GA2}
{loadmodule mod_sp_social,Follow Us}
{youtube}RjUnTDR7ZuY{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -