జయలలిత మరణించి రెండు సంత్సరాలు కావస్తున్న ఆమె మరణం ఇప్పటికీ మిస్టరీ రహస్యంగానే మిగలిపోయింది. అమ్మ మరణంపై అనేక రకాల కథనాలు ఇప్పటికీ వస్తున్నాయి. దీని వెనుకు శశకల కుట్ర కోణం ఉందని డీఎంకే నేతలు చాలా సందర్భాల్లో ఆరోపనలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా జయలలిత మరణంపై తెరమీదరకు మరో కొత్త వాదన వచ్చింది. జయలలితకు హల్వా ఇచ్చి చంపేశారంటూ రాష్ట్ర న్యాయశాఖ మంత్రి సీవీ షణ్ముగం సంచలన ఆరోపణ చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. అన్నాడీఎంకే తరఫున పోలింగ్ బూత్ ఏజెంట్ల సమావేశంలో ప్రత్యేక అతిథిగా ఆయన పాల్గొన్న ఆయన ఈ ఆరోపణ చేశారు. జయలలితను అపోలో ఆస్పత్రిలో చేర్చినప్పుడు ఆమెను చూసేందుకు వెళ్తే సాధ్యపడలేదని మంత్రి తెలిపారు. అంతేకాక శశికళే తమను ఆసుపత్రిలోకి అనుమతించలేదని ఆయన ఆరోపించారు.
జయలలిత మధుమేహంతో బాధపడుతున్న సంగతి తెలిసి కూడా ఆమెకు హల్వా ఇచ్చారన్నారు.ఈ విధంగా ఆమె వ్యాధి ముదిరి సహజంగా మరణించాలనే ఇలా ప్లాన్ చేశారంటూ ఆయన ఆరోపించారు. కార్డియాక్ అరెస్ట్ వస్తే ఆస్పత్రి వరండాలో రక్తం ఎలా చిందిందని? ఆ రక్తం ఎక్కడి నుంచి వచ్చిందని ఆయన ప్రశ్నించారు. న్యాయశాఖ మంత్రే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది.