Monday, May 5, 2025
- Advertisement -

మిస్సైళ్లు, యుద్ధ ట్యాంకులు మనల్ని కాపాడలేవు..

- Advertisement -

పాకిస్థాన్ మంత్రి అహ్సాన్ ఇక్బాల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బలమైన ఆర్థిక వ్యవస్థగా ఎదిగితేనే మనల్ని మనం కాపాడుకోగలమని, యుద్ధ‌ట్యాంకులు, మిస్సైల్లు కావ‌న్నారు. 1990ల్లో భారత ఆర్థిక మంత్రి మన్మోహన్‌ సింగ్‌ పాక్‌ మంత్రి సర్తాజ్‌ అజీజ్‌ అనుసరించిన ఆర్థిక వ్యూహాలను భారత్‌లో విజయవంతంగా అమలుపరిచి విజ‌యాలు సాధించార‌ని చెప్పారు.

బాంగ్లేదేశ్ కూడా ఆ వ్యూహాలను పక్కాగా అమలు చేసిందని… కానీ, సొంత ప్రణాళికలను అమలు చేయడంలో పాకిస్థాన్ మాత్రం విఫలమయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికంతా పాక్ లోని రాజకీయ అస్థిరతే కారణమని చెప్పారు. పాకిస్థాన్ నేషనల్ సెంటర్ ఫర్ సైబర్ సెక్యూరిటీ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రసంగిస్తూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఆర్థికంగా ఎదిగే అవకాశం పాకిస్థాన్ కు 1960లలోనే వచ్చిందని, 1990లలో రెండోసారి వచ్చిందని, మూడో అవకాశం ఇప్పుడు తలుపు తడుతోందని… ఈ అవకాశాన్ని గతంలో మాదిరి వదులుకోరాదని ఇక్బాల్ అన్నారు. ఏ దేశమైనా ఆర్థికంగా ఎదగాలంటే… శాంతి, సుస్థిరత, కొనసాగింపు అనేవి ప్రధానమైన అంశాలని చెప్పారు.

ఒకప్పుడు మనకంటే వెనుకబడి ఉన్న దేశాలు ఇప్పుడు మనకంటే మెరుగైన స్థానంలో ఎలా ఉన్నాయనే విషయాన్ని మనం ఆలోచించాలని తెలిపారు. ఒకప్పటి చైనా తలసరి ఆదాయం పాకిస్థాన్ కంటే చాలా తక్కువగా ఉండేదని… ఇప్పుడు ఆ దేశం ఎంతో ఎత్తుకు ఎదిగిపోయిందని చెప్పారు.

బంగ్లాదేశ్ విదేశీ మారకద్రవ్య నిల్వలు 33 బిలియన్ డాలర్లకు పెరిగితే, పాకిస్థాన్ లో విదేశీ మారకద్రవ్య నిల్వలు కేవలం 18 మిలియన్ డాలర్లుగా మాత్రేమే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థికంగా ఎదిగేందుకు ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని కూడా దుర్వినియోగం చేస్తే… భవిష్యత్ తరాలు మనల్ని క్షమించబోవని హెచ్చరించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -