Monday, April 29, 2024
- Advertisement -

ప్రధాని అంటే ఆయనే.. పరోక్షంగా మోడీపై సెటైర్స్ !

- Advertisement -

బీజేపీ సీనియర్ నేత, కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కారీ గత కొన్నాళ్లుగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు పోలిటికల్ సర్కిల్స్ లో తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి. గతంలో తనకు రాజకీయాలు వదిలేయాలనే ఆలోచన అప్పుడప్పుడు వస్తుందని ఆయన చేసిన వ్యాఖ్యలు ఆ మద్య బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. అలాగే కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి కూడా ఆయన చాలా సార్లు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓటమితో కాంగ్రెస్ నేతలు నిరాశ చెందవద్దని, ఓటమి వెంటే గెలుపు ఉంటుందని గతంలో నితిన్ గడ్కారీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయమే అయ్యాయి. ఇక ఆయన సొంత పార్టీపై కూడా గతంలో చాలాసార్లు వివాదాస్పద వ్యాఖ్యాలు చేశారు.

ప్రభుత్వ సరైన సమయాల్లో సరైన నిర్ణయాలు తీసుఓవడం లేదని బహిరంగంగానే మోడీ పాలనపై వ్యంగ్యస్త్రాలు సంధించారు. దీంతో నితీశ్ గడ్కారీ బీజేపీకి టాటా చెప్పే అవకాశం ఉందని ఆ మద్య గట్టిగానే వార్తలు వచ్చాయి. ఇక తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశం అవుతున్నాయి. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పై ఎప్పుడు లేని విధంగా ప్రశంశలు కురిపించారు. మన్మోహన్ సింగ్ ప్రవేశ పెట్టిన ఆర్థిక సంస్కరణల కారణంగానే దేశ ఆర్థిక వ్యవస్థ స్తిరంగా కొనసాగుతోందని. ఈ దేశమే మన్మోహన్ సింగ్ కు ఋణపడి ఉందని గడ్కారీ చెప్పుకొచ్చారు. టీఐవోఎల్ 2022 కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఆ విధంగా వ్యాఖ్యలు చేశారు.

అయితే గడ్కారీ చేసిన వ్యాఖ్యలు పరోక్షంగా మోడీకి చురకలు అంటించే విధంగా ఉన్నాయని కొందరు అభిప్రాయ పడుతున్నారు. ప్రస్తుతం మన దేశం ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. ఈ విధంగా అభివృద్ది చెందాదానికి కారణం మన్మోహన్ సింగే అని అర్థం వచ్చేలా గడ్కారీ మాట్లాడారని పలువురి వాదన. అంటే మోడీ చేసిందేమి లేదని.. అంతా మన్మోహన్ సింగ్ వల్లే ఆర్థిక వ్యవస్థ బలపడిందనే ఉద్దేశంలో గడ్కారీ వ్యాఖ్యలు ఉన్నాయని పోలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట. మరి మోడీ పాలనపై పెద్దగా ప్రశంశలు కురిపించని గడ్కారీ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పై ఎందుకు ప్రశంశలు కురిపిస్తున్నారనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. వీటిని పరిశీలిస్తే నితిన్ గడ్కారీ మరియు మోడీ అమిత్ షా ల మద్య కనిపించని కోల్డ్ వార్ నడుస్తోందనేది ఇప్పుడు పోలిటికల్ సర్కిల్స్ లో ప్రధానంగా వినిపిస్తున్న మాట.

ఇవి కూడా చదవండి

హోదా ఇవ్వలేని ప్రధానికి.. రాష్ట్రం వచ్చే హక్కు ఉందా ?

మూవీ పాలిటిక్స్.. ఇదే గురూ మన ట్రెండు !

ఏపీలో ఉపఎన్నిక..రాబోతుందా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -