Tuesday, April 30, 2024
- Advertisement -

మన మాజీ ప్రధాని పై ఒబామా రాతలు..!

- Advertisement -

భారత మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ అసాధారణ విజ్ఞానం కలిగిన నిరాడంబరమైన వ్యక్తి అని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ప్రశసించారు. ‘ఏ ప్రామిస్డ్‌ ల్యాండ్‌’ పేరుతో ఒబామా రాసిన పుస్తకంలో ఆయన ప్రపంచంలోని పలు దేశాల నేతల గురించి రాసుకొచ్చారు. 2010లో అధ్యక్షుడి హోదాలో ఒబామా భారత్‌లో పర్యటించారు. ఆ సమయంలో ప్రధానిగా ఉన్న మన్మోహన్‌సింగ్‌తో ఆయన పలు విషయాలపై చర్చించారు. అప్పటి పర్యటనలో భాగంగా మాజీ ప్రధానిలో ఒబామా గమనించిన అంశాలను పుస్తకంలో రాశారు. ఈ పుస్తకం నవంబర్‌ 17న విడుదల కానుంది. అయితే ‘ది న్యూయార్క్‌ టైమ్స్‌’ పత్రిక ఈ పుస్తకాన్ని ఇప్పటికే సమీక్షించింది.

1990లలో ఇండియాకు ఆర్థికమంత్రిగా వ్యవహరించిన వ్యక్తిని తనకు ఏడుపదుల వయస్సులో ఉన్నప్పుడు కలిశాను. ఆయన సున్నితంగా మాట్లాడే ఆర్థికవేత్త. తెల్లటి గడ్డం, తలపాగాతో కనిపించారు. అతను ఆర్థికమంత్రిగా ఉన్న సమయంలో లక్షలాది మంది ఆ దేశ ప్రజలు పేదరికం నుంచి బయటపడటానికి కృషి చేశాడు.

మన్మోహన్‌ సింగ్‌ తెలివైన వాడు దానితో పాటు నిజాయతీపరుడు’ అని ఒబామా పుస్తకంలో తెలిపారు. దీనితోపాటు మాజీ ప్రధాని విదేశాంగ ఒప్పందాలకు ప్రాముఖ్యం ఇచ్చేవారని ఒబామా పేర్కొన్నారు. తన పర్యటనలో భాగంగా దేశ రాజధాని దిల్లీలో మన్మోహన్‌సింగ్‌తో కలిసి పలు ఒప్పందాలు చేసుకున్నట్లు తన పుస్తకంలో బరాక్ ఒబామా వివరించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -