Thursday, May 8, 2025
- Advertisement -

1500 వంద‌ల మంది మేనేజ‌ర్ స్థాయి ఉద్యోగుల‌ను తొల‌గించిన టాటామోటార్స్

- Advertisement -

 

Tata Motors Cuts Up To 1,500 Managerial Jobs in workforce

ఐటీ సంస్త‌ల‌లో ఏర్ప‌డుతున్న ఉద్యోగుల కోత ప్ర‌భావం …ఇప్పుడు ఆటోమోబైల్ కంపెనీల మీద ప‌డింది. ఐటి ఉద్యోగుల‌ను తొలగిస్తున్న‌ట్లుగానే…ఇప్పుడు దేశీయ అటోమోబైల్ దిగ్గ‌జం టాటామోటార్స్ ఉద్యోగుల‌కు భారీ షాకింగ్ ఇచ్చింది.త‌మ ర్క్‌ఫోర్స్‌లో టాప్ ఉద్యోగుల‌ను తొల‌గిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

మేనేజర్‌ స్థాయిలో దాదాపు 1500 మంది ఉద్యోగులనుతొలగించనున్నట్టు బుధవారం ప్రకటించింది.
వైట్‌ కాలర్‌ ఉద్యోగులకు సంబంధించి 10-12 శాతం (సుమారు1500)మందిని తొలగిస్తున్నట్టు టాటా మోటార్స్‌ ఎండీ, సీఈవో గుంటెర్‌ బుచ్చక్ ప్రకటించారు. టాటా మోటార్స్‌ వార్షిక ఫలితాల సందర్భంగా ఆయన వివరాలను తెలిపారు.అలాగే బ్లూకాలర్‌ ఉద్యోగుల్లోఎలాంటి తొలగింపులులేవని స్పష్టం చేశారు.

{loadmodule mod_custom,Side Ad 1}
అయితే ఉద్యోగుల పనితీరు మరియు నాయకత్వ లక్షణాల ఆధారంగా ఈ చర్యలు తీసుకున్నామని కంపెనీ గ్రూప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ సి రామకృష్ణన్ తెలిపారు. ఇది నిర్వహణ ఖర్చుల తగ్గింపులో భాగ కాదని వివరణ ఇచ్చారు. వీరిలో కొంతమంది స్వచ్ఛంద ఉద్యోగ విరమణ పథకాన్ని ఎంచుకున్నారనీ, మరికొంతమందిని ఇతర విభాగాలను బదిలీ చేసినట్టు చెప్పారు.
2016-17 క్యూ4లో టాటా మోటార్స్ బ్రిటిష్‌ అనుబంధ సంస్థ జేఎల్‌ఆర్‌ ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది.క్యూ4(జనవరి-మార్చి)లో జేఎల్‌ఆర్‌ నికర లాభం 18 శాతం ఎగసి 55.7 కోట్ల పౌండ్లను తాకగా.. మొత్తం ఆదాయం 10 శాతం పుంజుకుని 726.8 కోట్ల పౌండ్లకు చేరింది. టాటా మోటార్స్‌ నికర లాభం కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన 17 శాతం క్షీణించి రూ. 4296 కోట్లను, మొత్తం ఆదాయం 3 శాతం తగ్గి రూ. 78,747 కోట్లను తాకింది.ఈ నేపథ్యంలో ఒడిదుడుల మార్కెట్లో టాటా మోటార్స్‌ షేరు భారీ లాభాలతో టాప్‌ విన్నర్‌ గా నిలిచింది.

{loadmodule mod_custom,Side Ad 2}

Also read

  1. ఆటెలీఫోన్ బూత్ ఇప్పుడు పేమ‌స్ అయిపోయింది
  2. డిపాజిట్ల‌పై క్యాష్ బ్యాక్ ఆఫ‌ర్‌ను ప్ర‌క‌టించిన పేటీఎమ్ పేవ్‌మెంట్ బ్యాంక్‌
  3. 2017-18 సంవ‌త్స‌రంలో ఐటీలో 1.5 లక్షల నియామకాలు
  4. గృహ‌రుణాల వ‌డ్డీరేట్ల‌ను త‌గ్గించిన యాక్సిస్‌బ్యాంక్‌

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -