Friday, May 24, 2024
- Advertisement -

డిపాజిట్ల‌పై క్యాష్ బ్యాక్ ఆఫ‌ర్‌ను ప్ర‌క‌టించిన పేటీఎమ్ పేవ్‌మెంట్ బ్యాంక్‌

- Advertisement -
Paytm Payments Bank launched today with zero min balance account

డిజిటల్‌ పేమెంట్‌ సంస్థ పేటీఎం నుంచి బ్యాంకు సేవలు నేటి నుంచి అందుబాటులోకి వచ్చేశాయి. గత బుధవారం రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నుంచి పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌కు అనుమతులు తెచ్చుకుంది. పేటీఎం తన పేమెంట్‌ బ్యాంక్‌ మొట్టమొదటి శాఖను నేడు ఢిల్లీలో ప్రారంభించింది.

డిపాజిట్ల‌కు ఇచ్చే వ‌డ్డీరేటును ప్ర‌క‌టించింది.దీంతో పాటు క్యాస్ బ్యాక్ ఆఫ‌ర్‌ను కూడా పేటీఎమ్ ప్ర‌క‌టించింది.
ప్ర స్తుతం దేశంలోని మొత్తం మూడు చెల్లింపులు (ఎయిర్టెల్, ఇండియా పోస్ట్) బ్యాంకులలో అత్యల్పంగా వడ్డీరేటును ఆఫర్‌ చేస్తోంది. ఏడాదికి ఎయిర్టెల్ 7.25 శాతం, ఇండియా పోస్ట్ 5.5 శాతం వడ్డీని అందిస్తోంటే పేటీఎం మాత్రం వినియోగదారులకు 4శాతం వార్శిక వ‌డ్డీని అప‌ర్ చేస్తోంది.

{loadmodule mod_custom,Side Ad 1}
పేటీఎం బ్యాంకు సేవింగ్‌ ఖాతాలో కనీస నగదు ఉండాల్సిన అవసరం లేదు. ఎలాంటి నగదు లేకుండానే ఖాతాను తెరుచుకోవచ్చు. దీంతోపాటు.. ఆన్‌లైన్‌ నగదు బదిలీలు ఉచితంగా చేసుకునే సౌకర్యం కల్పిస్తున్నట్లు పేటీఎం ఓ ప్రకటనలో తెలిపింది. ఇక డిపాజిట్లపై క్యాష్‌బ్యాక్‌ సదుపాయాన్ని కూడా అందిస్తోంది పేటీఎం. ఖాతాదారు పేమెంట్స్‌ బ్యాంక్‌ ఖాతాను తెరిచి.. అందులో రూ. 25వేలు డిపాజిట్‌ చేస్తే.. వారికి రూ. 250 క్యాష్‌బ్యాక్‌ వస్తుంది.

{loadmodule mod_custom,Side Ad 2}
చైనాకు చెందిన అలీబాబా, జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్‌ సహకారంతోరూ. 400కోట్ల పెట్టుబడులతో పేటీఎం తన బ్యాంక్‌ కార్యకలాపాలను తీసుకొస్తోంది.నా బ్యాంక్‌ డిపాజిట్లు సురక్షితంగా ఉంటాయని హామీ ఇస్తున్నాం’ అని పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ ఛైర్మన్‌ విజయ్‌ శేఖర్‌ శర్మ ఓ ప్రకటనలో తెలిపారు. తొలి ఏడాదిలో 31 బ్రాంచీలను స్థాపించాలని పేటీఎం ప్రయత్నిస్తోంది. 2020 నాటికి 500 మిలియన్ల కస్టమర్లను చేర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు శేఖర్‌ శర్మ చెప్పారు.

Also read

  1. గృహ‌రుణాల వ‌డ్డీరేట్ల‌ను త‌గ్గించిన యాక్సిస్‌బ్యాంక్‌
  2. 20,000 వేల నియామ‌కాలు చేప‌ట్ట‌నున్న దేశీయ ఐటీ దిగ్గ‌జం ఇన్ఫోసిస్…
  3. ఇక నుంచి మిమ్మ‌ల్ని రోబోలే ఇంట‌ర్వూ చేస్తాయి..
  4. బంగారు నానేల‌ను నిజాయితీగా పోలీసుల‌కు అప్ప‌గించిన మ‌హిళ‌

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -