Friday, May 17, 2024
- Advertisement -

సీఎం జగన్ కీలకసమావేశం..

- Advertisement -

సార్వత్రిక ఎన్నికల కోడ్ రావడంతో మరింత దూకుడు పెంచారు సీఎం జగన్. ఇవాళ వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్లతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. గుంటూరులోని తాడేపల్లి గూడెంలో జరిగే ఈ సమావేశంలో ఎన్నికల్లో గెలుపు వ్యూహంపై ప్రధానంగా చర్చించనున్నారు. ప్రజల కోసమే వైసీపీ అనే నినాదాన్ని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి అన్నదానిపై కో ఆర్డినేటర్లకు దిశానిర్దేశం చేయనున్నారు జగన్.

గత ఎన్నికల్లో నవరత్నాల మేనిఫెస్టోతో సక్సెస్ సాధించారు జగన్. ఇప్పుడు అంతకుమించి ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఒకటి,రెండు రోజుల్లో మేనిఫెస్టోను విడుదల చేయనుండగా అనంతరం ఎన్నికల ప్రచారంపై ఫోకస్ పెట్టనున్నారు. ఇవాళ జరిగే సమావేశంలో మేనిఫెస్టోలోని ప్రధాన అంశాలతో పాటు ప్రచారానికి సంబంధించి షెడ్యూల్‌పై చర్చించే అవకాశం ఉంది.

జగన్ చెప్పాడంటే చేస్తాడంతే…ఇదే నినాదాన్ని ప్రజల్లోకి వైసీపీ కేడర్ తీసుకెళ్లనుంది. గత ఎన్నికల్లో మేనిఫెస్టోలో ఇచ్చిన 99 శాతం హామీలను నెరవేర్చింది వైసీపీ. ఈ నేపథ్యంలో ఈసారి రైతులు, కార్మికులు, మహిళలలు, వృద్ధులు, యువత, విద్యార్థుల సంక్షేమమే ధ్యేయంగా మేనిఫెస్టో రూపకల్పన జరిగినట్లు ప్రచారం జరుగుతోందది. మొత్తంగా ఇవాళ జరిగే సమావేశంలో కీలక అంశాలను నేతలకు వివరించనున్నారు జగన్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -