కోడెల మరణం వెనుక అసలు కారణం.. బసవతారకంలో ఏం జరిగింది

కోడెల శివప్రసాద్ రావు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అవసరం లేని పేరు. తెలుగుదేశం హయాంలో చాలా కీలక పదవులు, బాధ్యతలు నిర్వహించిన కోడెల ఈ రోజు ఉదయం మరణించారు. గుండెపోటుతో బాధపడుతున్న కోడెల ఈ మధ్య నే హైదరాబాద్ లోని తన నివాసంకు వచ్చారు. ఈ రోజు ఉదయం 11 గంటల నుండి కోడెల ఆత్మహత్యయత్నం చేసినట్టు వార్త దావానంలా వ్యాపించింది. కానీ ఆయన ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదు అని వారి పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తుంది. కొన్ని నిమిషాల క్రితమే ఆయన మరణించినట్టు సమాచారం అందింది.

కానీ ఆయన మరణానంతరం పార్టీ వర్గాలు భిన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కోడెల ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు మాత్రం కాదని కొంతమంది వాధిస్తుంటే, ఆత్మహత్య అనంతరం ఎందుకు బసవతారకం హస్పిటల్ కి తీసుకువచ్చారు అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు. బసవతారకం హస్పిటల్ కాన్సర్ చికిత్సకు సంబందించింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ దగ్గర్లో చాలా హస్పిటల్స్ ఉండగా ఎందుకు తీసుకువెళ్ళలేదని సందేహం వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది కోడెలకు ఉన్న అతిపెద్ద బాధ అతని కొడుకు గురించే అని.. అతను సరిగా లేకపోవడంతోనే కోడెలకు ఈ గతి పట్టిందని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తుంది. కె టాక్స్, ఫర్నీచర్ కేసుల్లో కోడెల మీద ఉన్న కేసులు ఈ మధ్య చాలా వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆ కేసుల నుండి తప్పించుకోవడానికే కోడెల మరణాన్ని సైతం అతని కుటుంబం ఉపయోగించుకుంటుందని భిన్న అభిప్రాయం కూడా వ్యక్తం అవుతున్నట్టు తాజా సమాచారం.

ముందు 1 గంటపాటు ఉరి వేసుకుని ఆత్మహత్య అని చెప్పిన టీవీ ఛానళ్ళు, తరువాత అంతా గుండెపోటు అని చెబుతున్నాయి. కోడెల మరణం వెనుక ఇన్ని రకాల భిన్న అభిప్రాయాలు వెలువడుతుండటంతో కోడెల అభిమానులు తీవ్ర మనస్తాపంలో ఉన్నారు.