- Advertisement -
రెండు రోజులగా ఏపీలో జరగుతున్న డ్రోన్ రచ్చ పంచాయితీ గవర్నర్ వద్దకు చేరింది. బాబు నివాసం వద్ద డ్రోన్ ఎగరడాన్ని టీడీపీ నేతలు తప్పుబడుతున్నారు. రాష్ట్రప్రభుత్వం, డీజీపీ డ్రోన్ ఎగరడంపై క్లారిటీ ఇచ్చినా టీడీపీ నేతలు మాత్రం శాంతించలేదు. ఈ విషయాన్ని చాలా సీరీయస్ గా తీసుకున్న టీడీపీ నేతలు సోమవారం గవర్నర్ బిశ్వ భూషణ్ కి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నాలుగు పేజీల లేఖను గవర్నర్ కు అందజేశారు. డ్రోన్ ఎగురవేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. చంద్రబాబు భద్రతను తగ్గించిన జగన్ ప్రభుత్వం, హైకోర్టు కల్పించుకున్న తరువాతే తిరిగి పునరుద్ధరించిందని గుర్తు చేశారు.