Thursday, May 2, 2024
- Advertisement -

టీడీపీ సీనియర్ల పని అంతేనా?

- Advertisement -

టీడీపీ – జనసేన – బీజేపీ పొత్తులో భాగంగా జనసేన 21,బీజేపీ 10, టీడీపీ 144 సీట్లలో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక టీడీపీ తొలి,రెండు జాబితాల్లో కలిపి 128 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. అయితే ఇక టీడీపీ ప్రకటించడానికి మిగిలింది 16 స్థానాలే. అయితే సీనియర్లకు ఈ రెండు జాబితాల్లో చోటు దక్కలేదు. దీంతో ఈ 16 స్థానాల్లోనైనా తమ పేర్లు ఉంటాయా అన్న సందిగ్దం నెలకొంది.

ఇక పొత్తుల్లో భాగంగా కీలకమైన స్థానాలను జనసేన, బీజేపీకి కేటాయించడాన్ని టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. దీనికి తోడు కొంతమంది సీనియర్లకు సీటు ఇచ్చేందుకు చంద్రబాబు ఇష్టపడటం లేదు. అయితే సీటు ఆశీస్తున్న నేతల జాబితా ఎక్కువగానే ఉంది. ప్రధానంగా గంటా శ్రీనివాసరావు, కళా వెంకట్రావు, దేవినేని ఉమా, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో పాటు మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం, వసంత కృష్ణ ప్రసాద్ ,మహిళా నేత గౌతు శిరీష టికెట్లు ఆశీస్తున్నారు. అయితే ఇందులో కొంతమంది నేతలకు ప్రత్యామ్నాయ నియోజకవర్గాలు చూపించగా వారు వెళ్లేందుకు ససేమీరా అనడంతో చంద్రబాబు సైతం నో చెప్పారని తెలుస్తోంది.

గంటా భీమిలి టికెట్‌ను ఆశీస్తుండగా ఆయనకు చీపురుపల్లిని, కళా వెంకట్రావ్ ఎచ్చెర్ల సీటు కోసం తీవ్రంగా పట్టుబడుతున్నారు. అలాగే కిమిడి నాగార్జున ,బొడే ప్రసాద్,మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ టీడీపీలో చేరికతో సీనియర్‌ నేత దేవినేని ఉమ సీటు డైలమాలో పడింది. సర్వేపల్లి సీటును సోమిరెడ్డి ఆశీస్తున్నారు. దీంతో పాటు పలు జిల్లాల్లోని స్థానాల్లో తీవ్ర పోటీ ఉండటంతో ఎవరికి సీటు దక్కుతుందోనన్న ఉత్కంఠ మాత్రం నెలకొంది. మరి చంద్రబాబు నిర్ణయం ఎలా ఉండనుంది, టికెట్ దక్కని నేతలు ఏం చేస్తారో వేచిచూడాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -