నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో టీడీపీకి చేదు అనుభవాలు ఎదరవుతున్నాయి.ఇప్పటికే పార్టీనుంచి చాలామంది వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.నంద్యాలలో పార్టీకి పెద్దదిక్కుగా ఉన్న పార్టీ ఎమ్మెల్సీకూడా వైసీపీలోకి వెల్లేందుకు సిద్దంగా ఉన్నట్లు సమాచారం.ఇప్పుడు తాజాగా మరో ఎదురు దెబ్బతగలనుంది.
ఉప ఎన్నిక టికెట్‌ను ఆశించి బంగపడ్డ శిల్పా …వైసీపీలోకి వెల్లి టికెట్‌ను సంపాదించుకున్నారు.అయితే ఇప్పుడు అన్న బాటలోనె తమ్ముడు కూడా నడవనున్నారే వార్త హల్‌చల్ చేస్తోంది.తాజా సంఘటనలే దీనికి బలం చేకూర్చుతున్నాయి.
ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్న శిల్పా చక్రపాణి త్వరలోనే వైకాపాలోకి జంప్ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఈ సోదరులకు నంద్యాల నియోజకవర్గంలో మంచి పట్టుందన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక సోదరుడికి వ్యతిరేకంగా, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ప్రచారం చేసేందుకు ఆయన సుముఖతతో లేరని తెలుస్తోంది.ఈ విషయాన్ని ముందే పసిగట్టిన తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం నంద్యాల ప్రచార బాధ్యతలను కూడా ఆయనకు అప్పగించలేదు. సోదరుడి గెలుపు కోసం ఆయన తనవంతు పాత్రను పోషిస్తున్నారని తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు. ఇటీవల తెలుగుదేశం పార్టీ నిర్వహించిన ఓ కార్యక్రమానికి సైతం ఆయనకు ఆహ్వానం అందలేదు.మొత్తం వ్యవహారం నంద్యాల నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది. పార్టీ మారే విషయమై శిల్పా చక్రపాణిరెడ్డి నుంచి అధికారిక ప్రకటన వెలువడకున్నా, ఆయన పార్టీని వీడటం ఖాయమన్న వార్తలు వస్తున్నాయి. ఎన్నికలకు ముందే జరిగితే టీడీపీ గెలుపుపై ఉన్న చివరి ఆశలు కూడా గల్లంతవుతాయి.
Related