Saturday, May 4, 2024
- Advertisement -

టీడీపీకి భయం పట్టుకుంది.. అందుకే రంగంలోకి డిప్యూటీ సీఎం కేఈ

- Advertisement -
AP Deputy CM KE advice to Jagan

నంద్యాల ఉప ఎన్నికలను వైసీపీ,టీడీపీలు ప్ర‌తిష్టాత్మకంగా తీసుకున్నాయి. నంద్యాలలో వైసీపీ గెలిస్తే పార్టీ మైలేజ్ పెరుగుతోంది. అలా కాదని ఓడితే.. ఖ‌చ్చితంగా ఎఫెక్ట్ చూపుస్తుంది. టీడీపీ గెలిస్తే.. బాబు ప్ర‌భుత్వానికి మ‌రో ఐదేళ్లు తిరుగులేద‌ని అంటున్నారు.

ఒకవేళ టీడిపీ ఓడిపోయిన ఆ ఎఫెక్ట్ స్ప‌ష్టంగా క‌నిపిస్తది. అందుకే ఇప్పుడు నంద్యాల ఉప ఎన్నిక‌లో పోటీ హోరాహోరీగా ఉండబోతుంది. అయితే ఈ విషయంలో జగన్ ఇంకోసారి ఆలోచించుకుంటే బాగుంటుందని డిప్యూటీ సీఎం ముఖ్య‌మంత్రి కేఈ కృష్ణ‌మూర్తి సూచించారు. గతంలో ఏ ప్ర‌జాప్ర‌తినిధి చ‌నిపోయినా ఆ స్థానాన్ని త‌మ త‌మ కుటుంబ స‌భ్యులు ఏక‌గ్రీవం అయ్యేలా ఓ ఆచారం ఉంద‌ని,ఆ ఆచారాన్ని అలాగే పాటిస్తే మంచిద‌ని చెప్పాడు కేఈ.అవినీతి ఆరోప‌ణ‌లు ఎదుర్కోంటున్న జ‌గ‌న్ పార్టీలోకి శిల్పా వెళ్ల‌డం హాస్యాస్ప‌ద‌మ‌న్నారు. ఇటివలే నంద్యాల ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో టీడీపీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అఖిలప్రియ, కాల్వ శ్రీనివాసులు కూడా హాజరయ్యారు. అయితే నంద్యాల ఉప ఎన్నికలో గెలపోటముల బాధ్యత తనదేనని గతంలోనే ధీమాగా ప్రకటించింది అఖిలప్రియ. కానీ ఆమెపై అంత భారాన్ని వెయకుండా నియోజకవర్గ ఇంచార్జ్ గా డిప్యూటీ సీఎం కేఈ సోదరుడు ప్రభాకర్ ను నియమించారు. అయితే.. ప్రభాకర్ ను నియమించడంతో అఖిలప్రియ మనస్తాపానికి గురైందట. అయితే ఇప్పుడు సీఎం కేఈ రంగంలోకి దిగి.. శిల్పాను పోటీనుంచి త‌ప్పించాలని జ‌గ‌న్ను కోర‌డం పార్టీలో క‌ల‌వ‌ర పెడుతుంది.

ఉప ఎన్నిక‌ల ప్ర‌చారంలో దూసుకుపోతుంటే కేఈ మాత్రం ఇంకా ఆలోచించండి,త‌ప్పుకోండి,ఆచారాన్ని పాటించండి అని చెప్ప‌టం ఏంటో అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఇరు పార్టీల కార్య‌క‌ర్త‌లు. కేఈ మాటల అంతరార్థం మాత్రం టీడీపీలో ఓ వర్గాన్ని టార్గెట్ చేసినట్లుగా తెలుస్తుంది.నంద్యాలలో టీడీపీ గెలిచే ఛాన్స్ లేదని టీడీపీలో ఓ వర్గం బలంగా నమ్ముతుందటద.శిల్పా చేరికతో వైసీపీకే గెలుపు అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని,కాబట్టి ఎలాగైనా ఉప ఎన్నికలేకుండా ఏకగ్రీవం చేసేకుంటే మంచిదని వారు భావిస్తున్నారట. కాబట్టి జగన్ కు మళ్లీ ఓసారి రిక్వెస్ట్ చేసి ఉప ఎన్నికల్లో పోటీ లేకుండా చేసేలా ప్లాన్ వేస్తున్నారట.అందుకే కేఈతో అలాంటి కామెంట్స్ చేయించారేమో అన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి. భూమా బ్రహ్మానందరెడ్డి కన్నా, శిల్పా మోహన్ రెడ్డికే ఎక్కువగా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నట్లు తెలుస్తోంది.

{youtube}dZnWAATbUK4{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. జిల్లాలో వైసీపీకి రోజు రోజుకి పెరిగిపోతున్న ఆద‌ర‌ణ‌…
  2. తెర‌ముందుకు వైసీపీ ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్‌….
  3. విజ‌య‌వాడ రాజ‌కీయాల్లో సంచ‌ల‌నం.. వైసీపీలోకి మ‌ల్లాది విష్ణు
  4. వైసీపీలోకి.. టీడీపీ ఎమ్మెల్యే.. షాక్‍లో చంద్రబాబు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -